మూడేళ్ళ పాలన ని పూర్తి చెసుకున్న మోడీ తెలుగు వారికి షాక్ ఇచ్చే నిర్ణయం దిశగా అడుగులు వెయ్య బోతున్నారా ? డిల్లీ వర్గాలు అవును అనే అంటున్నాయి. ఇప్ప‌టిదాకా అవినీతి మీద అస్త్రాల‌ను ఎక్కుబెట్టిన మోడీ త‌దుప‌రి ల‌క్ష్యం పార్టీ ఫిరాయింపులుగా క‌నిపిస్తోంది. ఈశాన్య రాష్ట్రాల‌లో ఇలాంటి ప‌నికే పాల్ప‌డిన బీజేపీ ఈ నిర్ణ‌యం తీసుకుంటుందా అనే సందేహం ఉండ‌వ‌చ్చు.


ఎలాగూ అటు ఎన్నిక‌లైపోయాయి కాబ‌ట్టి ఇప్పుడాయ‌న త‌న దృష్టిని ద‌క్షిణావ‌నిమీద పెట్టార‌నిపిస్తోంది. త‌మిళ‌నాడులో బ‌ల‌ప‌డ‌డానికి అంచెలంచెల వ్యూహాల‌ను అమ‌లుచేస్తున్నారు. అక్క‌డ బ‌ల‌ప‌డే అవ‌కాశ‌ముంది త‌ప్ప అధికారంలోకి వ‌చ్చే సావ‌కాశం లేదు.


సో తదుపరి టార్గెట్ తెలుగు రాష్ట్రాలే.తెలుగు రాష్ట్రాల‌లో బ‌ల‌ప‌డాల‌ని చూస్తున్న బీజేపీ ఇలాంటి చ‌ర్య తీసుకుంటే అది ఊహించ‌ని ఫ‌లితాలూ, ప్ర‌యోజ‌నాలూ వ‌చ్చి ప‌డ‌తాయి. ప్రాంతీయ పార్టీల వైఖ‌రితో ప్ర‌జ‌లు విసిగిపోయి ఉన్నారు.. ప్ర‌త్యామ్నాయం లేక వారు వాటికి ఓట్లు వేయాల్సి వ‌స్తోంది. ఏరు దాటాక‌.. సామెత మాదిరిగా అవి వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. అమ‌రావ‌తిలో భూముల సేక‌ర‌ణే దీనికి ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌. తెలుగు రాష్ట్రాల‌లో కాషాయ జెండా రెపరెప‌లాడించ‌డానికి మోడీకి ఇదే స‌రైన స‌మ‌యం.


మరింత సమాచారం తెలుసుకోండి: