ఆలస్యంగా మాట్లాడినా ఆగ్రహంగా అమిత్ షా గురించి స్పందించారు కెసిఆర్ . తెలంగాణా పర్యటన లో తన గురించీ తన ప్రభుత్వం గురించీ సరిగ్గా తెలుసుకోకుండా షా మాట్లాడారు అంటూ తనదైన శైలి లో విమర్శించారు కెసిఆర్. .అయితే అమిత్‌షానూ టిబిజెపి నేతలైన లక్ష్మణ్‌ కిషన్‌ రెడ్డి వంటివారిని విమర్శించడం వరకూ తీవ్రంగానే మాట్లాడారు.


ఇప్పుడు అధికారంలో లేని అద్వాణీపైన ఆగ్రహం వెలిబుచ్చారు. అయితే అసలు సిసలు అధినేత ప్రధాని మోడీని గాని కేంద్రాన్ని గాని పల్లెత్తు మాటనకుండా వదిలేశారు.


ఈ సందర్భంగా తను ప్రధాని అయినట్టు అప్పుడప్పుడూ కలవస్తుంటుందని కెసిఆర్‌ చెప్పడం ఆసక్తికరం. వచ్చినంత మాత్రాన అది జరుగుతుందో లేదో అందరికీ తెలుసని ఆయన అన్నారు. బిజెపి తెలంగాణలో అధికారంలోకి రావాలని చేస్తున్నప్రయత్నాలపై వ్యాఖ్యానించే సందర్భంలో ఆయన ఈ పోలిక తెచ్చారు.కాని నిజంగానే ఆ పార్టీలో అప్పుడప్పుడూ ప్రధాని చర్చ వస్తుంటుందని సన్నిహితులు చెబుతుంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: