సైన్యం అంటే అడుగడుగునా క్రమశిక్షణ.. ఇక భారత సైన్యం శక్తి సామర్థ్యాల్లో ఎవరికీ తీసిపోదు. కానీ ఇండియాలో సైన్యం ప్రభుత్వాన్ని పాలించే వారి చేతుల్లో ఉంటుంది. రాజకీయ నాయకుల అజమాయిషీనే ఎక్కువ. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. కానీ పాకిస్థాన్ పరిస్థితి వేరు. అక్కడ కొన్నిసార్లు సైన్యం డామినేషన్ ఉంటుంది. 

Image result for india pak border

ఐతే.. ఇప్పుడు సరిహద్దుల్లో ఉన్న యుద్ధవాతావరణం నేపథ్యంలో మోడీ సర్కారు కూడా సైన్యానికి కాస్త స్వేచ్ఛ ఇస్తోంది. యుద్ధ వాతావరణంలో సైనికాధికారులు స్వీయ నిర్ణయాలు తీసుకోవచ్చని రక్షణమంత్రి అరుణ్  జైట్లీ లేటెస్టుగా కామెంట్ చేశారు. సైనిక ఉన్నతాధికారులు సమయానుకూల నిర్ణయాలు తీసుకోవచ్చన్నారు. దీని కోసం పార్లమెంటు సభ్యులను సంప్రదించాల్సిన అవసరంలేదన్నారు. 



ఇటీవల కాశ్మీర్ లో భద్రతా దళాలపై రాళ్ల దాడి జరిగిన సమయంలో ఓ మేజర్ ఓ ఆందోళనకారుడిని జీపుకి కట్టి మానవ కవచంగా తీసుకెళ్లారు. సైనికుల ప్రాణాలు కాపాడారు. సదరు మేజర్ లీతుల్  గొగోయ్ ను సైనిక జనరల్  బిపిన్  రావత్  సత్కరించారు. ఇలాంటి సమయంలో రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే రెచ్చిపోతున్న పాక్ కు బుద్ది చెప్పేందుకు సైన్యానికి ఫుల్ పవర్స్ ఇచ్చినట్టేనా..!?



మరింత సమాచారం తెలుసుకోండి: