ఈ మద్య తమిళనాడులో రాజకీయాల గురించి ప్రతిరోజూ ఎదో ఒక సెన్సేషన్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది.  దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో అపోలో హిస్పిటల్ లో చేరినప్పటి నుంచి ఆమె మరణించిన తర్వాత సీఎం పీఠం కోసం ఆమె నమ్మిన బంటులు పన్నీరు సెల్వం, శశికళ మద్య జరిగిన యుద్దం తర్వాత పళని స్వామి సీఎం పీఠం దక్కించుకోవడంతో ముగిసిందనుకున్నారు.
kerala-court-issues-notice-to-bharathiraja
 కానీ ఆర్ కె నగర్ లో ఉప ఎన్నికల సందర్భంగా మరో రగడ..అన్నాడీఎంకే గుర్తు అయిన రెండు ఆకుల కోసం చిన్నమ్మకు బంధువైన దినకరణ్ ఏకంగా ఎలక్షన్ కమిషన్ సభ్యులకు లంచం ఇవ్వజూపడంతో అతన్ని అరెస్టు చేశారు. మొత్తానికి అక్కడి ఉపఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇలా తమిళనాడు రాజకీయాలో రోజుకో మలుపు తిరగడంతో ఇప్పుడు సరైన నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ తన ఫ్యాన్స్ తో మీటింగ్ పెట్టి దేవుడు ఆజ్ఞాపిస్తే..రాజకీయాల్లోకి వస్తా అన్నాడు.
Image result for తమిళనాడు ఈసికి లంచం
 దీంతో కొంత మంది సంతోషిస్తే..మరికొంత మంది ఆయన్ని వ్యతిరేకించారు.  రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ మీద తమిళనాడులో ఇప్పుడు పెద్ద చ‌ర్చే జరుగుతుంది. రాజకీయాల్లోకి రావాలని అభిమానులు, వస్తే ఊరుకునేది లేదని తమిళనాడు సంఘాల మధ్య యుద్ద‌మే జ‌రుగుతుంది. సీనియర్ దర్శకులు, రజనీకాంత్ కి ఎన్నో హిట్లు ఇచ్చిన పాతతరం దర్శకులు భారతీరాజా, రజనీ పొలిటికల్ ఎంట్రీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నువ్వు తమిలియన్ కాదు. తమిళ వ్యక్తి కాని వాడికి తమిళ ప్రజలని పాలించే హక్కు లేదు, ఉండదు అని తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: