ఆయన రాజకీయాలలోకి వస్తాడో లేదో తెలీదు గానీ ఆ ఒక్క పాయింట్ నీ అడ్డం పెట్టుకుని భారీ డిస్కషన్ లు నడుస్తున్నాయి . రజినీకాంత్ రాజకీయ ప్రవేశం ప్రముఖ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. తాజాగా ఒక జాతీయ ఛానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన కమల్ హాసన్.. రజనీపై సెటైర్లు వేశారు.


కెమెరాలు ఎక్కడుంటే అక్కడ రజనీ కనిపిస్తారన్న కమల్.. ఆయనకు కెమెరాలు కనిపిస్తే హడావుడి చేయటం అలవాటే.. అందుకే హడావుడి చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. సామాజిక కోణంలోనే టీవీ షో చేస్తున్నట్లుగా పేర్కొన్న కమల్.. ప్రజలతో మమేకం కావటం కోసమే తాను టీవీ షో చేస్తన్నట్లుగా వెల్లడించారు. ఓపక్క రజనీ పొలిటికల్ ఎంట్రీపై తమిళ సంఘాలు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: