సీఎం కుర్చీ అధిరోహించడమే పరమావధిగా పెట్టుకున్న వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ కు సీఎం సీటు సంగతి పక్కకు పెడితే మళ్లీ కారాగారవాసం తప్పదా అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ప్రధాని మోదీని జగన్ కలిసి వచ్చాడు. ప్రధానితో అనేక విషయాలు చర్చించానన్నాడు. కానీ మీడియాకు మాత్రం రొటీన్ విషయాలు చెప్పుకొచ్చాడు. 



అది సరే.. ఆవిషయం అలా ఉంచితే.. టీడీపీ- బీజేపీ మధ్య దూరం పెరిగితే.. వైసీపీకి అది రాజకీయంగా మంచి అవుతుందని జగన్ పార్టీ నాయకులు ఆశించారు. ఐతే.. వైసీపీ పట్ల బీజేపీ ఇంకా ఓ అవగాహనకు వచ్చినట్టు కనిపించడం లేదు. మోడీని జగన్ కలసిన తర్వాత వైసీపీలో కలిగిన ధైర్యం.. ఆ తర్వాత అమత్ షా బెజవాడ టూర్ తో నీరుగారిపోయింది. 



అందులోనూ.. బెజవాడ టూర్లో  అమిత్ షా చేసిన కొన్ని వ్యాఖ్యలు జగన్ కు కంగారు పెంచుతున్నాయి. ఇంకా ప్రత్యేక హోదా అంటూ పోరాడుతున్నవారిపై పేరు పెట్టకుండా ఘాటు వ్యాఖ్యలు చేశారు. న‌రేంద్ర మోదీ ఏపీకి ఏం చేశారని కొంద‌రు అంటున్నార‌ని,  తాను మోదీ త‌ర‌ఫున జ‌వాబు ఇస్తానని అమిత్ షా చెప్పారు. అంతే కాదు.. హోదా కావాలంటున్నవారు చెవులు రిక్కించి మరీ వినండీ అంటూ సెటైర్లు కూడా పేల్చారు. 



ఏపీకి మొత్తం లక్షా 70 వేల కోట్ల రూపాయల నిధులు ఇచ్చామని.. ఈ విషయం హోదా హోదా అని అరిచేవారు గుర్తు పెట్టుకోవాలని నేరుగానే ఎటాక్ చేశారు. ఆ ఎటాక్ జగన్ గురించే అన్న సంగతి అందరికీ తెలిసిందే. అంతనాటకీయంగా, వ్యంగ్యంగా అమిత్ షా జగన్ ను కామెంట్ చేయడం వైసీపీ వర్గాలకు కలవరం కలిగిస్తోంది. తాము బీజేపీ వైపు ఎంతగా స్నేహ హస్తం చాస్తున్నా.. బీజేపీ టీడీపీ వైపే మొగ్గడం చూస్తే ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని కంగారుపడుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: