ఇంటర్ నెట్, సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ వచ్చేశాక మానవ సంబంధాల్లోనూ పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రత్యేకించి జియో వంటి ఉచిత నెట్ ఆఫర్ల తాకిడి  తర్వాత ప్రత్యేకించి టీనేజ్ పిల్లలు బాగా ఆకర్షితులవుతు న్నారు. నెట్లో హద్దూ అదుపూ లేని పోర్న్ వీడియోలు చూసి తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు.



బెంగుళూరులో ఓ టీనేజ్ కుర్రాడు.. ఫేస్ బుక్ కు అడిక్ట్ అయ్యి.. ఏకంగా తల్లిదండ్రుల బెడ్ రూమ్ శృంగారాన్నే షూట్ చేసి ఇంటర్ నెట్లో పెట్టేశాడు. ఈ కుర్రాడి బలహీనతను సొమ్ముచేసుకున్న మరో ఫేస్ బుక్ మిత్రుడు... అతడికి అమ్మాయిల న్యూడ్ వీడియోలు పంపి ఆకర్షించాడు. మరిన్ని వీడియోలు కావాలంటే మీ అమ్మానాన్నా శృంగారం వీడియో తీసి ఫేస్ బుక్ లో పెట్టమని కోరాడు. 



ఈ కుర్రాడు పోర్న్ వీడియోల మత్తులో పడి ఆ ఫేస్ బుక్ ఫ్రెండ్ అడిగినట్టే చేసి కుటుంబాన్ని చిక్కుల్లో పడేశాడు. సదరు ఫేస్ బుక్ స్నేహితుడు.. ఆ వీడియోలను అడ్డం  పెట్టుకని ఆ తల్లిదండ్రులను బెదిరించడం మొదలు పెట్టాడు. 10 లక్షలు ఇవ్వకపోతే పేరెంట్స్ సెక్స్ వీడియోను ఇంటర్ నెట్లో పెడతానని బెదిరించాడు. ఆ పేరెంట్స్ పోలీసులను 
ఆశ్రయించి దర్యాప్తు చేస్తే అసలు విషయం బయటపడింది. 



కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుడిని తేజల్ పటేల్ గా గుర్తించారు. అతడి కోసం వేట సాగిస్తున్నారు. అందుకే తల్లిదండ్రులూ మీ పిల్లలేం చేస్తున్నారో.. చూస్తున్నారో.. ఓ కన్నేసి ఉంచండి. 



మరింత సమాచారం తెలుసుకోండి: