చినరాజప్ప.. ఏపీ ఉపముఖ్యమంత్రి... దశాబ్దాలపాటు పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నా.. పాపం 2014 వరకూ కనీసం ఎమ్మెల్యే కూడా కాలేకపోయాడు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా 
దశాబ్దాల తరబడి పనిచేసినా.. ఎలాంటి పదవీ పొందలేకపోయాడు. కానీ 2014 తర్వాత ఆయన దశ తిరిగింది. ఏకంగా ఉప ముఖ్యమత్రి అయ్యారు.. ఆ హోదాలోనే అసెంబ్లీలో 
కాలుపెట్టారు.

Image result for chinna rajappa
తాజాగా మహానాడులో ఆయన చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. పార్టీ సభ్యత్వ నమోదు - పార్టీ నిర్మాణం అనే అంశంపై తీర్మానం ప్రవేశపెట్టిన చినరాజప్ప.. ఆ తర్వాత పార్టీలో కార్యకర్తలకు లభించే గుర్తింపు పై ప్రసంగించారు. నాయకులు కష్టపడి పనిచేస్తే పదవులు అవే వస్తాయనడానికి తన జీవితమే ఓ ఉదాహరణ అన్నారు చినరాజప్ప. ఈ సందర్భంగా ఆయన కొన్ని సైటైర్లు కూడా వేశారు.


Related image
కొందరు నాయకులు ఎమ్మెల్యేలు అయ్యాక తోకలు జాడిస్తున్నారని చినరాజప్ప కొందరిపై కామెంట్లు చేశారు. ఎన్నికల ముందు కార్యకర్తలతో ఎలా ఉంటారో ఎమ్మెల్యే అయ్యాక కూడా అలాగే ఉండాలని సూచించారు. మరికొందరు కొందరు నేతలు తాము చేసేది అధినేతకు తెలీదు అనుకుంటున్నారని.. కానీ చంద్రబాబుకు అన్నీ తెలుసని చెప్పుకొచ్చారు. 

Related image

చంద్రబాబు దగ్గర అందరి జాతకాలు ఉన్నాయి.. ఆయనకు అందరి పనితీరు తెలుసు.. ఓవర్ యాక్షన్ చేస్తున్నా నాయకుల తోకలను వచ్చే ఎన్నికల నాటికి సీఎం కట్ చేస్తారని చినరాజప్ప కామెంట్ చేశారు. కొందరు నాయకులు పదవులు రాని వారిని కొందరు రెచ్చగొడుతున్నారని ఇది కరెక్ట్ కాదని చినరాజప్ప అన్నారు. మొత్తానికి ఎప్పడూ ప్రసంగాలు చేయని చినరాజప్ప ఈసారి బాగానే మెయింటైన్ చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: