కేసీఆర్ ఇటీవల తరచూ ఎన్నికల సర్వేలు నిర్వహిస్తున్నాడు. తన పాలన ఎలా ఉంది.. పథకాలు ఎలా ఉన్నాయి.. అనే అంశాలపైనే కాకుండా తన పార్టీ నాయకులు ఎంత 
ఆదరణ ఉంది. ఎలా పనిచేస్తున్నారు.. అనే అంశాలపై కూడా ఆయన లోతుగా సర్వే చేయిస్తున్నాడు. తాజాగా కేసీఆర్ టీమ్ చేయించిన సర్వేలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. 

గతంలో సర్వే చేయించిన సమయంలో టీఆర్ఎస్ కు 100 కంటే ఎక్కువ స్థానాలు వస్తాయని తేలింది. ఈసారి మాత్రం ఆ ఆదరణ ఇంకా పెరిగినట్టుంది.. ఇప్పుడు పోటీ చేస్తే .. ఇప్పటికిప్పుడు  ఎన్నికలు  నిర్వహిస్తే టీఆర్ఎస్ కు 111 స్థానాలు తప్పనిసరిగా వస్తాయట. తెలంగాణలో మొత్తం అసెంబ్లీ సీట్లు 119. అందులో 111 టీఆర్ఎస్ కే వస్తాయట. మరి విడ్డూరంగా ఉన్నట్టు అనిపిస్తోంది కదా. 

Image result for kcr election survey


ఇక మిగిలిన పార్టీల విషయానికి వస్తే.. ప్రధాన ప్రతిపక్షంగా భావిస్తున్న తెలంగాణకు కేవలం రెండంటే రెండే వస్తాయట. ఆ రెండు ఏవో కూడా చెప్పేసింది సర్వే.. అవి కల్వకర్తి, మధిర మాత్రమేనట. మధిరలో కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ భట్టి విక్రమార్క ఉన్నాడు కదా. ఇక కల్వకుర్తిలో వంశీచందర్ రెడ్డి ఉన్నాడు. హైదరాబాద్ లో ఎంఐఎం ఆరు స్థానాల్లో గెలుస్తుందట.

ఇకపోతే.. తెలంగాణలో 2019లో అధికారంలోకి రావాలని కచ్చితంగా తేల్చి చెప్పిన అమిత్ షా కు కేసీఆర్ సర్వే షాక్ ఇవ్వొచ్చు. ఎందుకంటే ఆ పార్టీకి కేసీఆర్ సర్వే ప్రకారం 
వచ్చే సీట్లు గుండు సున్నా. బీజేపీకే కాదు.. తెలంగాణలో తెలుగు దేశానికీ అంతేనట. మరి ఈ సర్వే చూశాక పార్టీలు తమ వ్యూహాలు మార్చుకుంటాయా.. ఆ.. కేసీఆర్ సర్వే అలాగే వస్తుందిలే అని తీసిపారేస్తాయా.. చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: