గుజరాత్ లో ఘోరం జరిగింది. కోపంతో కళ్లు మూసుకుపోయిన ఓ నీచుడు సొంత భార్యను అన్నలతో రేప్ చేయించాడు.. తాను దగ్గర ఉండి మరీ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ లోని దహోద్ జిల్లాలో ఏడాది క్రితం ఓ జంటకు పెళ్లయింది. ఐతే.. వారిది మొదటి నుంచి కలహాల కాపురంగానే సాగింది. గొడవలు మరీ ఎక్కువ కావడం తో భార్య ఇటీవల పుట్టింటికి వెళ్లిపోయింది. 

Image result for gang rape

భార్య ప్రవర్తనతో విసుగుచెందిన ఆ భర్త ఏకంగా ఆమె జీవితాన్నే నాశనం చేసేయాలని నిర్ణయించుకున్నాడు. భార్య పుట్టింటికి వెళ్లి తాను మారిపోయినట్టు నటించాడు. కాపురానికి వస్తే గొడల్లేకుండా హాయిగా ఉందామని నమ్మబలికాడు. భార్య  పుట్టింటి వారినీ నమ్మించాడు. కూతురు కాపురం బావుండాలని కోరిన తల్లిదండ్రులు ఆమెను భర్త దగ్గరకు పంపారు. 


Image result for gang rape
భార్య తన ఇంటికి రాగానే ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఆమెను ఇంట్లో బంధించి హింసించడం ప్రారంభించాడు. విషయం తెలుసుకున్న పుట్టింటివారు అల్లుడిపై కిడ్నాప్ కేసు పెట్టారు. ఈ విషయం తెలిసిన మూర్ఖుడు మరీ రెచ్చిపోయాడు. తానే స్వయంగా తన అన్నలను పిలిచి.. వారిని తన భార్యను రేప్ చేయమని ప్రోత్సహించాడు. అతడి ముగ్గురు అన్నలూ ఆమెపై అత్యాచారం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని అన్నల కోసం వెదుకుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: