హైదరాబాద్ చేప మందు.. ఇది చాలా ఫేమస్..  ప్రత్యేకించి ఉబ్బసానికి ఈ మందు దివ్యౌషధంగా పనిచేస్తుందని చాలామంది అనుభవం. హైదరాబాద్ లో బత్తిని సోదరులు కొన్ని దశాబ్దాలుగా ప్రతి ఏటా ఈ చేప మందును పంపిణా చేస్తున్నారు. ఈ మందు అద్భుతంగా పని చేస్తుందని వాడిన భక్తులు చెబుతుంటారు. ఇలా మౌత్ పబ్లిసిటీతోనే ఈ మందు ప్రాచుర్యంలోకి వచ్చింది. 

fish medicine కోసం చిత్ర ఫలితం

ఐతే.. బత్తిని సొదరుల చేపమందు అశాస్త్రీయమైందని దీన్ని ప్రభుత్వం ప్రోత్సహించొద్దని జనవిజ్ఞాన వేదిక అంటోంది. ఈ మందులో ఉన్న జబ్బులు పోవడం సంగతి అలా ఉంచి కొత్త బజ్బులు వచ్చే అవకాశం ఉందని జన విజ్ఞాన వేదిక జాతీయ అధ్యక్షులు బ్రహ్మారెడ్డి డిమాండ్ చేశారు. చేప ప్రసాదంలో ఉబ్బసాన్ని తగ్గించే ఎలాంటి మందులు లేవని ఇప్పటికే పరీక్షల్లో తేలిందంటున్నారాయన.

fish medicine కోసం చిత్ర ఫలితం


ఐనా జనం అయినా మూఢనమ్మకాలతో బత్తిని సోదరులు ప్రజలను మోసం చేస్తున్నారని బ్రహ్మారెడ్డి విమర్శించారు. చేప ప్రసాదం పంపిణీలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించినా నిర్వాహకులు దాన్ని పట్టించుకోవడంలేదన్నారు. 

fish medicine కోసం చిత్ర ఫలితం
చేతితో నోట్లో చేప ప్రసాదం వేస్తూ అంటూ వ్యాధులకు కారణమవుతున్నారని జన విజ్ఞాన వేదిక ఆరోపించింది. పదేళ్ల క్రితం లక్షల్లో వచ్చే రోగులు ఇప్పడు వేలకు పడిపోయారని.. ఈ సంఖ్య పూర్తిగా తగ్గిపోయే వరకు... ప్రజల్లో అవగాహన కల్పిస్తూనే ఉంటామని బ్రహ్మారెడ్డి తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: