ఇప్పటికే విద్యుత్ సంస్కరణలతో దూకుడుగా ముందుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు మరో శుభవార్త. లోటు బడ్జెట్ తో పగ్గాలు అందుకున్నా.. చంద్రబాబు తన నాయకత్వ పటిమతో ఏపీని విద్యుత్ కొరతలేని రాష్ట్రంగా తీర్చిదిద్దాడని తెలుగు దేశం నేతలు చెప్పుకుంటుంటారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఏపీ నిరంతర విద్యుత్ అందించడం ప్రారంభించింది. 

power sector కోసం చిత్ర ఫలితం

ఇప్పుడు ఈ విద్యుత్ రంగంలోనే మరో ఆసక్తికరపరిణామం చోటు చేసుకుంది. ప్రతి ఒక్కరికీ విద్యుత్ అందాలన్న లక్ష్యంతో ఏపీ అందరికీ విద్యుత్ పథకం రూపొందించింది. అభివృద్ధిలో అందర్నీ భాగస్వామ్యం చేసే ప్రక్రియ ఇది. భారీగా సొమ్ము ఖర్చయ్యే ఈ పథకానికి రుణం కోసం ఏపీ ప్రపంచ బ్యాంకును విజ్ఞప్తి చేసింది. ఏపీ చేసిన విజ్ఞప్తిని ప్రపంచ బ్యాంకు మన్నించింది. 

world bank కోసం చిత్ర ఫలితం

ఆంధ్రప్రదేశ్ కు ప్రపంచ బ్యాంకు 15 వందల 47 కోట్ల రుణం మంజూరు చేసింది.  ఈ నిధులతో విద్యుత్ సరఫరా, పంపిణీలో మౌలికసదుపాయాలు మెరుగుపడతాయని ప్రపంచ బ్యాంకు ఆకాంక్షించింది. ఎంపిక చేసిన పట్టణాల్లో స్మార్ట్ గ్రిడ్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. అందరికీ విద్యుత్ పథకం ప్రాజెక్టు ఏపీ వృద్ధికి ఊతమిస్తోందని అభిప్రాయపడిన ప్రపంచ బ్యాంకు. నాణ్యమైన విద్యుత్ అందిస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోందని తెలిపింది. ష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలకు సహకారం అందిస్తామని తెలిపిన ప్రపంచ బ్యాంకు భరోసా ఇచ్చింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: