విశాఖపట్నంలో మహానాడు ఘనంగా ముగిసింది. మూడు రోజులపాటు పార్టీ కార్యక్రమంగా ఆశించిన రీతిలోనే ఘనంగా జరిగింది. ఐతే.. ఈ సభావేదికపై నుంచి చంద్రబాబు కొందరు నేతలకు ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. బీజేపీ- టీడీపీ మైత్రిపై ఇష్టానుసారం నేతలు నోరు జారితే సహించేది లేదని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు.  

chandrababu warning కోసం చిత్ర ఫలితం

ఇకపై నోటికొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోనని చంద్రబాబు గట్టి హెచ్చరికలు పంపారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన కొంతమందికి ఇంకా తెలుగుదేశం సిద్ధాంతాలు తెలియడం లేదని ఆయన విమర్శించారు. ఐతే.. అన్ని సమస్యలను త్వరలోనే గాడిలో పెడతానని చంద్రబాబు అన్నారు.  క్రమశిక్షణ విషయంలో ఏమాత్రం రాజీ లేదని స్పష్టం చేశారు. 

chandrababu warning కోసం చిత్ర ఫలితం

క్రమశిక్షణ పాటించని పార్టీలకు మనుగడ లేదని చంద్రబాబు గుర్తు చేశారు. అభివృద్ధిపైనే పూర్తి స్థాయిలో దృష్టి సారించటం వల్ల పార్టీలో చిన్న చిన్న సమస్యలు వచ్చాయని చంద్రబాబు అన్నారు. అందరికీ పదవులు ఇవ్వలేమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని చంద్రబాబు నాయకులకు సూచించారు. స్వలాభం కోసం ఏది పడితే అది బహిరంగంగా మాట్లాడితే ఇక ఉపేక్షించనని తేల్చి చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: