తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. అసత్యాలతో చంద్రబాబు మాయ చేస్తున్నారని మండిపడ్డారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి మాట తప్పినందురు చంద్రబాబు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు. 



తెలంగాణ పై దృష్టి సారిస్తానని మహనాడులో ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై  కేసీఆర్ ఘాటుగా స్పందించారు. తెలంగాణకు చంద్రబాబు అవసరం లేదన్న ఆయన డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానన్న హమీ నిలబెట్టుకోనందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, టీడీపీ పార్టీలు చేయలేని ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను తమ ప్రభుత్వం చేపట్టిందని చెప్పారు. 



కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ పార్టీ 15 రోజుల్లో 4 సార్లు న్యాయస్థానాలను ఆశ్రయించిందని మండిపడ్డారు. ఎవరు అడ్డం పడినా ప్రాజెక్టులు ఆపేది లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఎన్నికల హామీలన్నింటినీ తాము నెరవేర్చుతున్నట్లు చెప్పారు.కాంగ్రెస్  పార్టీ ఎమ్మెల్యేలకు ఆత్మవిశ్వాసం ఉంటే పదవులకు రాజీనామా చేసి తిరిగి  గెలవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సవాల్ విసిరారు.



మరింత సమాచారం తెలుసుకోండి: