Image result for southwest monsoon 2017

భారత వ్యవసాయరంగానికి, ముఖ్యంగా దక్షిణ భారత రైతాంగానికి ప్రాణాధారమైన నైరుతి రుతుపవనాలు రెండు రోజుల ముందే దేశంలోని ప్రధాన భూభాగంలోకి ప్రవే శించాయి. అండమాన్‌ దీవుల మీదుగా ప్రయాణించిన రుతుపవనాలు మంగళవారం ఉదయం ఇటు దక్షిణ కేరళ, అటు ఈశాన్య భారతంలోకి ప్రవేశించాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడి, చిరుజల్లులే కాదు కొన్నొ చోట్ల వర్షాలు మొదలయ్యాయి. సాధారణంగా జూన్‌ 1 న నైరుతి రుతు పవనాలు సాధారణంగా కేరళలను తాకుతాయి. అందుకు భిన్నంగా ఈసారి రెండు రోజుల ముందే అంటే మే 30నే ప్రవేశించాయి. 

Image result for southwest monsoon 2017

మంగళవారం భారత్‌లోని ప్రధాన భూభాగం కేరళ లోకి లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తూ జూన్‌ మొదటివారంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను తాకనున్నాయి. ఇక దీంతో రైతులు వ్యవసాయ పనులను వేగవంతం చేసేపనిలో పడ్డారు. ఈ ఏడాది సాధారణ సగటు వర్షపాతం మాత్రమే ఉంటుందని భారత వాతావరణ శాఖ ప్రకటించిన నేపద్యంలో రైతులు పంటపనుల్లో ముందే సిద్దమౌతున్నారు. 

Image result for southwest monsoon 2017

నైరుతీ రుతుప‌వ‌నాలు కేర‌ళ రాష్ట్రాన్ని తాకాయి. దీనికి సంబంధించిన అధికార‌క ప్ర‌క‌ట‌న వెలుబ‌డాల్సి ఉంది. నైరుతీ రుతుప‌వ‌నాల వ‌ల్లే దేశ‌వ్యాప్తంగా సుమారు 70 శాతం వ‌ర్షం న‌మోదు అవుతుంది. కేర‌ళ‌లో సోమ‌వారం నుంచే వ‌ర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇవాళ కేర‌ళ రాష్ట్ర వ్యాప్తంగా వ‌ర్షాలు న‌మోదైన‌ట్లు తెలుస్తున్న‌ది. అల‌ప్పుజా, కొట్టాయ‌మ్ జిల్లాల్లో ఆరు సెంటీమీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదైంది. కొచ్చిలో అయిదు సెంటీమీట‌ర్లు, త్రిసూర్‌, కోజికోడ్ జిల్లాల్లో మూడు సెంటీమీట‌ర్ల చొప్పున వ‌ర్షపాతం న‌మోదు అయ్యింది. మ‌రో అయిదు రోజుల పాటు కేర‌ళ రాష్ట్రంలో ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు ప‌డే అవ‌కాశాలున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: