చెరుకూరి రామోజీరావు, దాసరి నారాయణరావు.. తెలుగు కళారంగంలో ఇద్దరూ దిగ్గజాలే.. రామోజీరావు ప్రముఖ పారిశ్రామికవేత్త అయితే... దాసరి నారాయణ రావు సినీరంగంలో తిరుగులేని దిగ్గజం.. మరి ఈ ఇద్దరకూ గొడవలు వచ్చాయా.. ఆ గొడవలకు కారణమేంటి.. ఆ తర్వాత ఇద్దరూ ఎందుకు రాజీ పడ్డారు.. ఇలాంటి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..



తెలుగు ఈనాడు పత్రిక తిరుగులేని ఆధిపత్యం గురించి అందరికీ తెలిసిందే. కానీ దాసరి నారాయణరావు స్థాపించిన ఉదయం పత్రిక ఈనాడును సవాల్ చేసింది. సంచలన కథనాలతో తెలుగు జర్నలిజాన్ని పరుగులెత్తించింది. ఈనాడుకు దీటుగా నిలిచింది. ఆ సమయంలో ఈ ఇద్దరి మధ్య వృత్తిపరమైన వైరం ఉండేది. ఆ తర్వాత కాలంలో ఆర్థికపరమైన ఇబ్బందులతో దాసరి ఈ పత్రికను నడపలేకపోయారు. 



రామోజీరావు కూడా ఉదయం పత్రిక ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టేందుకే అప్పట్లో మద్యపాన నిషేధ ఉద్యమాన్ని ప్రారంభించారని కూడా చెబుతారు. ఏదేమైనా ఈనాడుకు గట్టిపోటీ ఇచ్చినా సుదీర్ఘకాలం ఉదయం మనుగడ సాధించలేకపోయింది. రామోజీ, దాసరి మధ్య విబేధాలు ఉదయంతోనే ఆగిపోలేదు. ఆ తరవాత కూడా వారి మధ్య పరోక్ష యుద్ధాలు జరిగాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: