దాసరి నారాయణ రావు అంటే ఎవరు.. ఆయనో దర్శకుడు.. ఆ తర్వాత నిర్మాత.. ఆ తర్వాత ఆయనో రచయిత.. ఇంకా దాసరి గురించి చెప్పాల్సి వస్తే.. ఆయనో రాజకీయ నాయకుడు. మాజీ మంత్రిగా కూడా పని చేశారు. ఈ విషయాలన్నీ చాలామందికి తెలిసినవే. తెలుగు సినీరంగానికి ఆయనో మూల స్థంభం, పెద్ద దిక్కు అన్న సంగతి కూడా అందరికీ తెలుసు.

Image result for dasari etv

కానీ దాసరి నారాయణరావులో మరో కోణం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అదేంటంటే.. ఆయనో పత్రికాధిపతి. ఆయన అప్పట్లో ఈనాడు దిన పత్రికను సవాల్ చేస్తూ ఉదయం పత్రికను తీసుకొచ్చారు. సంచలనం సృష్టించారు. అనేక సంచలన కథనాలు ఉదయం అందించింది. ప్రత్యేకించి అప్పట్లో సాగుతున్న నక్సల్  ఉద్యమంపై అనేక ప్రత్యేక కథనాలు ఇచ్చింది. 



కేవలం ఉధయం దిన పత్రిక ఒక్కటే కాదు. శివరంజని అని సినీపత్రికు కూడా తీసుకొచ్చారు. స్పెషల్ పేజీల సంస్కృతిని తీసుకొచ్చారు. ఆయన అప్పట్లో జర్నలిస్టులకు స్వేచ్చ బాగా ఇచ్చేవారట. పత్రికా విధి నిర్వహణలో పెద్దగా వేలు పెట్టేవారు కాదట. యువ జర్నలిస్టులను ప్రోత్సహించారట. కానీ తెలుగు పత్రికారంగంలో అనేక సంచలనాలు సృష్టించిన ఉదయం అనేక ఆర్థిక కారణాలతో మూతబడింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: