దాసరి నారాయణరావు బహుముఖ ప్రజ్ఞాశాలి. అనేక రంగాల్లో ఆయన ప్రతిభ వెలిగింది. సినీరంగంలోనే కాకుండా రాజకీయ రంగంలోనూ ఆయన సత్తా చాటారు. కాంగ్రెస్ పార్టీలో పలు పదవులు అలంకరించారు. కేంద్రమంత్రిగానూ పని చేశారు. ఐతే.. ఆయన రాజకీయ జీవిత చరమాంకంలో మాత్రం ఓ మచ్చ ఆయనపై అలాగే ఉండిపోయింది. 

Image result for dasari coal scam

అదే బొగ్గు కుంభకోణం. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో బొగ్గు గనుల కేటాయింపులు వివాదాస్పదం అయ్యాయి. క్విడ్ ప్రో కో ద్వారా దాసరి లబ్ది పొందారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ విచారణ కూడా  సాగింది.  తలబిరా బొగ్గు గనులను ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న నైవేలి లిగ్నైట్ లిమిటెడ్‌తో పాటు మరో సంస్థకు కేటాయించాలని బొగ్గు గనుల శాఖ ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీ సిఫారసు చేయగా ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో వాటిని ప్రైవేటు రంగంలోని హిందాల్కో సంస్థకు కేటాయించింది. 

Image result for dasari coal scam

ఈ కేటాయింపు విషయంలో దాసరి పాత్ర ఉందని ఆరోపణలున్నాయి. అయితే తలబిరా బొగ్గు గనులను హిందాల్కో సంస్థకు కేటాయించాలని పిఎంఓ చేసిన సూచనను తాను వ్యతిరేకించానని దాసరి నారాయణ రావు విచారణ సమయంలో సిబిఐ అధికారులతో చెప్పారట. ఇంకా ఈ విచారణ ఓ కొలిక్కి రాలేదు. దాసరిపై అభియోగాలు రుజువు కాలేదు. కానీ బొగ్గు కుంభకోణంలో దాసరి పేరు మాత్రం అలాగే ఉండిపోయింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: