చెన్నైలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం..  ఏడంస్తుల భవనాన్ని బుగ్గి చేసింది. చెన్నైలోని ప్రఖ్యాత చెన్నై శిల్క్స్ భవనం అగ్నిప్రమాదం ధాటికి పేకమేడలా కూలిపోయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏర్పడిన మంటలు మొత్తం భవనం వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది దాదాపు 24 గంటలు శ్రమిస్తే గానీ మంటలు అదుపుకాలేదు. అంత వేడి తట్టుకోలేక భవనం కుప్పకూలింది.

Image result for chennai silks fire
ఈ ప్రమాదంలో చిక్కుకుపోయిన 12 మందిని మాత్రం ప్రాణాలతో కాపాడగలిగారు. 150కి పైగా ఫైరింజన్లు, 300మంది అగ్నిమాపక సిబ్బంది రోజంతా శ్రమించినా మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. ఈ మొత్తం ప్రమాదంలో దాదాపు 400 కేజీల బంగారం మంటల్లో కరిగిపోయిందని చెబుతున్నారు. ఇవి కాకుండా ఖరీదైన వస్త్రాలు నగదు మొత్తం 300 కోట్ల రూపాయల వరకూ ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని బావిస్తున్నారు.  

Image result for chennai silks fire


ఏడంతస్తులకు మంటలు వ్యాపించడంతో ఉష్టోగ్రత అమాంతం పెరిగిపోయింది. దాదాపు 150 డిగ్రీల ఉష్టోగ్రత నమోదై ఉంటుందని భావిస్తున్నారు. అంతటి ఉష్ట్రోగ్రతలో 24 గంటల పాటు ఉండటంతో భవనం తట్టుకోలేకపోయింది. పేక మేడలా కుప్పకూలింది. చెన్నైలోని ఖరీదైన టీ.నగర్‌ లో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో 2 వేల కిలోల వెండి నగలు, 20 కోట్ల రూపాయల విలువైన వజ్రాభరణాలు, 80 కోట్ల దస్తులు బుగ్గిపాలయ్యాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: