జియో సిమ్ రాక స్మార్ట్ ఫోన్ వాడకం దార్ల జీవితాలను ఎంతగానో ప్రభావం చూపింది. అప్పటివరకూ నెట్లో వీడియో చూడటం కాస్ట్లీ వ్యవహారంగా ఉండేది. డేటా రేట్లు కూడా గూబలదిరిపోయేలా ఉండేవి. కానీ జియో పూర్తి ఉచితం ఆఫర్ తో జనం నెట్ వినియోగించడం విపరీతంగా పెరిగింది. ఎంతగా అంటే ఫేస్ బుక్ అధినేత మన ముఖేష్ అంబానీ కృతజ్ఞతలు కూడా చెప్పారు. 


ఐతే ఇంత చేసి మన భారతీయ స్మార్ట్ ఫోన్ వినియోగదార్లు ఆ డేటాతో ఏం చేస్తున్నారు. అంతగా నెట్ పై ఏం చూస్తున్నారు. ఈ అంశాలపై నిర్వహించిన ఓ సర్వే ఆసక్తికరమైన ఫలితాలను అందించింది. డేటా రేట్లు తగ్గిన తర్వాత మనవాళ్లు బూతు సైట్లు చూసేందుకు ఎగబడ్డారట. జియో రాక తర్వాత అడల్ట్ సైట్లను చూసేవారి సంఖ్య 75 శాతానికిపైగా చేరుకుందట. 

Image result for you tube telugu adult content
వీడియో వ్యూయర్‌షిప్ ట్రాకర్ విడూలీ అనే సంస్థ ఈ సర్వే చేపట్టింది. ప్రత్యేకించి ఈ ధోరణి  టైర్ 2, టైర్ 3 సిటీల్లో ఎక్కువగా ఉందట. కావాల్సినంత డేటా అందుబాటులో ఉండడంతో బూతు వీడియోలను డౌన్ లోడ్ కూడా చేయకుండానే డైరెక్టుగా సైట్లలోనే చూసేస్తున్నారట. అలాగని ఒక్క బూతు మాత్రమే చూడటం లేదు లెండి. మ్యూజిక్, ఎంటర్‌టైన్‌మెంట్, న్యూస్ , కామెడీ షోలు చూడటం కూడా బాగా పెరిగిందట. ఈ నాలుగు కేటగిరీల్లో 40 శాతం వీక్షణలు పెరిగాయట. 



మరింత సమాచారం తెలుసుకోండి: