తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన పాటలు రాసిన ప్రముఖ కవి, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి అంత్యక్రియలు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ముగిశాయి.   సినారె అంత్యక్రియలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యాయి. ఫిలింనగర్ లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు అధికార లాంఛనాల మధ్య కాసేపట్లో జరగనున్నాయి. సాహితీ శిఖరాన్ని కడసారి చూడటానికి పెద్ద సంఖ్యలో కవులు, రచయితలు, భాషాభిమానులు తరలి వచ్చారు.

బొగ్గులకుంటలోని సారస్వత్‌ పరిషత్‌ నుంచి ప్రారంభమైన సినారె అంతిమయాత్రలో వేలాది మంది పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో చివరి సంస్కారాలు నిర్వహించింది. అభిమాన క‌వి సినారె అంతిమ‌యాత్ర‌ను ఆయన ముందుండి నడిపించారు. అంత్య‌క్రియ‌ల తంతు ముగిసే వ‌ర‌కు ఆయన మ‌హాప్రస్థానంలోనే ఉన్నారు.  సినారె తనను ఇంటి పేరుతో సహా పిలిచేవారంటూ గుర్తు చేసుకున్నారు.  సినారె పార్థవం దేహాన్ని చూసి ఒకింత భావోద్వేగానికి లోనైన నరసింహన్ కంటతడి పెట్టుకున్నారు.  


 తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ బుధవారం నాడు సినారె పార్థివ దేహం వద్ద నివాళులు అర్పించారు. సినారె మరణం తెలుగు జాతికి తీరని లోటు అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.   ఈ అంతిమ సంస్కారాలకు కేసీఆర్ తో పాటు మంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులు హజరయ్యారు. అంతకు ముందు సినారె పార్థివదేహానికి సారస్వత పరిషత్ నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్రను నిర్వహించారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: