ప్రత్యర్ధిపై గాని ప్రత్యర్ధి దేశంపై గాని అనుచిత వ్యాఖ్యలు చేసే ముందు వారి స్టామినా ఎంత మన స్టామినా ఎంత? అనే విషయం బేరీజు వేసుకున్న తరవాతే వ్యాఖ్యలు చేసుకోవచ్చు. కాని ఒక చిన్న కోడి పిల్ల లాంటి వాళ్ళు పోయి పోయి డేగ తో పెట్టుకుంటే జరిగేది మరణమో అవమానమో తప్ప అంతకంటే మంచి జరగదు. దానికి ఉదాహరణే బంగ్లాదేశ్ కు భారత్ చేసిన వస్త్రాపహరణమే సాక్ష్యం. చదవండి. 


ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్‌లో 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌‌ను చిత్తుగా ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్ మరో గుణపాఠం కూడా నేర్పింది. సెమీఫైనల్‌కు ముందు బంగ్లాదేశ్ క్రికెట్‌ ఫ్యాన్స్‌‌ సోషల్ మీడియా ద్వారా చేసిన చిల్లర పనికి తగిన బుద్ధి చెప్పింది. బంగ్లాదేశ్ ఫ్యాన్స్ తమ వక్రబుద్ధిని చాటుకుంటూ భారత జాతీయ పతాకాన్ని అవమానించారు.


భారత్‌ను కుక్కతో పోల్చుతూ, బంగ్లాదేశ్‌ను పులితో పోల్చారు. అంతటితో ఆగలేదు. బంగ్లాదేశ్ జాతీయ పతాకంతో ఉన్న పులి భారత త్రివర్ణ పతాకంతో ఉన్న కుక్కను వేటాడుతున్నట్టు ఫొటో మార్ఫింగ్‌ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చివరకు వారందరికీ మెన్ ఇన్ బ్లూ గట్టిగా గుణపాఠం చెప్పారు. మరోసారి ఇలాంటి పిచ్చివేషాలు వేయకుండా ఘన విజయంతో వారి నోరు మూయించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: