తమిళనాట ఏర్పడ్డ రాజకీయ సంక్షోభానికి తెర దించాలంటే రజనీ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడమే అందుకు పరిష్కార మార్గమని, రజనీ కొత్త పార్టీ ఏర్పాటుకు ఇదే సరైన సమయం అని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే.. ఆయన సీఎం అవ్వడం ఖాయమని ఇలా పలురకాల వార్తలు మీడియా లో వెలువడుతున్న సందర్భంలో రజనీ పుట్టిన రోజున కొత్త పార్టీ ప్రకటనకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయని వార్తలు వెలువడుతున్నాయి. కానీ రజనీ మాత్రం రాజకీయ పార్టీ ఏర్పాటుపై ఎలాంటి ప్రతిస్పందన ఇవ్వడం లేదు.



వాస్తవానికి రాజకీయాల పేరెత్తితేనే రజనీ రాజకీయాలకు నేను ఆమడ దూరం అని చాలా సార్లు ప్రకటించారు. ఈ హడావుడి అంతా రజనీ ఫ్యాన్స్ తో పాటు కొన్ని రాజకీయ పార్టీలు పనిగట్టుకొని మరీ ప్రచారం చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఇటీవల రజనీ తన అభిమానులతో ఫోటో సెషన్ నిర్వహించారు. ఆ సమయంలో ‘యుద్ధం వచ్చినప్పుడు చూద్దాం. సిద్ధంగా ఉండండి’ అంటూ చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.


Image result for rajinikanth new political party

ఆయన రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమవ్వడం వల్లనే అలాంటి ప్రకటన చేశారని పలు వర్గాలు విశ్లేషించాయి. బీజేపీ అయితే తమ పార్టీలో చేరాలంటూ బహిరంగంగానే పిలుపునిచ్చింది. అయినా రజనీ రాజకీయ రంగ ప్రవేశం పై మల్లగుల్లాలు పడుతునట్లు, ఇప్పటివరకు సినిమా కు సంబంధించిన ప్రముఖుల్లో చాలా తక్కువ మంది మాత్రమే వారు అనుకున్న స్థానాన్ని చేరుకోవడం, చాలా మంది మధ్యలోనే రాజకీయ సన్యాసం తీసుకోవడం ఇలాంటివి రజనీ రాజకీయ ప్రవేశాన్ని అడ్డుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: