తమిళ , తెలుగు రాజకీయాలు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలూ రజినీకాంత్ వైపే చూస్తున్నాయి. ఆయన త్వరలో రాజకీయల్లలోకి వస్తారు అనే వార్త తీవ్రంగా ప్రచారం అవుతూ ఉండడం తో రజిని ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసారు అని కథనాలు వినాపడుతున్నాయి. తమిళనాడు రాజకీయం లో ప్రస్తుతం తీవ్ర సంక్షోభం ఉండనే ఉంది. పవర్ ఫుల్ లీడర్ వేదిక మీదకి రావాల్సిందే అంటూ ప్రజలు సైతం కోరుతున్నారు. జయలలిత ముఖ్యమంత్రి స్థానం లో మరణించిన తరవాత అక్కడ ఏర్పడ్డ అనేక పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం.


అక్కడి రాజకీయం మొత్తం కుక్కలు చింపిన విస్తరి లాగా అయిపొయింది. పరిశీలకులు సైతం రజినీకాంత్ లాంటి స్ట్రాంగ్ లీడర్ వస్తేనే కానీ ఈ పరిస్థితి మారదు అనే ఉద్దేశ్యం తో ఉన్నారు. రజిని రాక మీద జనాలు , మీడియా అందరూ పాజిటివ్ ఫీలింగ్ తో నడుస్తూ ఉండడం రజిని కి పెద్ద పాజిటివ్ పాయింట్. రోబో 2 , కాలా సినిమాల షూటింగ్ లో బిజీ గా ఉన్న రజినీకాంత్ ఈ చిత్రాల షూటింగ్ లు డిసెంబర్ లోగా పూర్తి చేసే పనిలో ఉన్నారు.


ఆయన పుట్టిన రోజున డిసెంబర్ 12 నాటికి వారం ముందరే ఈ రెండు సినిమాల షూటింగ్ లూ పూర్తి చేసెయ్యాలి అని ఆయన అనుకుంటున్నారు. ఆ రోజునే అధికారికంగా రజిని తన పార్టీ పేరు , గుర్తు ఇతర డిటైల్స్ మీడియా సాక్స్తిగా, తన వేలాది అభిమానుల సాక్స్తిగా విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. మొన్ననే ఫాన్స్ తో పర్సనల్ గా చాలా రోజులు మీటింగ్ సెషన్స్ గడిపిన రజినీకాంత్ వారితో ఫోటో లు కూడా దిగి పంపించారు. ‘స‌మ‌రం వ‌చ్చిన‌ప్పుడు చూసుకుందాం, పోరాటానికి సిద్ధంగా ఉండండి’ అంటూ అభిమానుల‌కు పిలుపు నిచ్చారు.


ఈ ప్ర‌క‌ట‌నతో రజ‌నీ రాజ‌కీయ అరంగేట్రం దాదాపు కంఫర్మ్ అనే అనుకోవ‌చ్చు. రాజ‌కీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి క్షేత్ర‌స్థాయి ప‌నుల్ని ఒక ప్రైవేటు సంస్థకు అప్ప‌గించిన‌ట్టు కూడా తెలుస్తోంది. పార్టీ ప్ర‌క‌ట‌న నాడు ఎలాంటి ఈవెంట్స్ ఉండాల‌నే ప్లానింగ్ కూడా జ‌రుగుతోంద‌ట‌.

 


మరింత సమాచారం తెలుసుకోండి: