అంబులెన్సుకు దారిచ్చేందుకు ఏకంగా రాష్ట్రపతి కాన్వాయ్‌కి బ్రేకులు వేసిన బెంగళూరు ట్రాఫిక్ పోలీసు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ నిజలింగప్ప పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మెట్రో-గ్రీన్-లేన్‌ను ప్రారంభిం చేందుకు శనివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బెంగళూరు వచ్చిన సంగతి తెలిసిందే.

bangalore tinity circle president canvoy కోసం చిత్ర ఫలితం


రాజ్‌భవన్ వైపు వెళుతున్న ఆయన కాన్వాయ్ రద్దీగా ఉండే ట్రినిటీ సర్కిల్‌ వద్దకు చేరు కోగానే, అదే సమయంలో ఒక రోగి ఉన్న అంబులెన్స్‌ ట్రాఫిక్ నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నది  అది  గమనించిన ట్రాఫిక్ పోలీసు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ నిజలింగప్ప ట్రాఫిక్‌ ను నిలిపివేసి ఆ అంబులెన్సుకు లైన్-క్లియర్ చేసి పంపించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ నిజలింగప్ప ఆ తర్వాతే రాష్ట్రపతి కాన్వాయ్‌కి దారిచ్చారు. 


విషయం తెలుసుకున్న ఈస్ట్ డివిజన్ ట్రాఫిక్ డీసీపీ అభయ్ గోయల్, ట్విటర్ వేదికగా నిజలింగప్పపై ప్రశంసలు కురింపించారు. "భారత తొలిపౌరుడి కంటే ముందు అంబులెన్సుకు దారి చ్చినందుకు నిజలింగప్ప ప్రశంసలందుకున్నారు. బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు అంబులెన్సుకు దారిచ్చినట్టుగానే మీరు ఇస్తారా?" అని పోస్టు చేశారు. దీనిపై బెంగళూరు సీపీ ప్రవీణ్ సూద్ కూడా "వెల్‌డన్" అంటూ స్పందించారు. తర్వాత కొద్ది క్షణాల్లోనే ఫేస్‌-బుక్ ట్విటర్ వేదికగా నెటిజన్లు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులను ప్రశంసలతో ముంచెత్తారు.

సంబంధిత చిత్రం

మరింత సమాచారం తెలుసుకోండి: