నేడు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఎక్కడ చూసినా యోగా కు సంబంధించిన కార్యక్రమాలే కనిపిస్తున్నాయి.  సోషల్ మీడియాలో సెలబ్రెటీలు చేస్తున్న యోగాసనాలు దుమ్మురేపుతున్నాయి.  ఇక పీఎం నుంచి కామన్ మ్యాన్ వరకు యోగా చేస్తూ దాని విషిష్టత గురించి చెబుతున్నారు.  భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత యోగాకు సముచితమైన స్థానం కల్పించారు. భారతీయులందరికీ యోగా వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. ఎన్నో కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లారు.  
గ్రేట్ వాల్ ఆఫ్ చైనాపై యోగాసనాలు
ఇక అంతర్జాతీయ యోగా పురస్కరించుకొని చైనాలోని పలు ప్రాంతాల్లో యోగా ప్రేమికులు ఆసనాలు వేశారు. అయితే బీజింగ్‌లోని గ్రేట్ వాల్ ఆఫ్ చైనాపై వేసిన యోగాసనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. యోగా డేలో భారత్‌ తర్వాత అత్యధిక ప్రజలు పాల్గొనేది చైనాలోనే అన్న విషయం అందరికీ తెలియదు.

యోగా డే ఉండాలనే భారత్ ప్రతిపాదనను సమర్థించిన చైనా ప్రతియేటా అధికారికంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది.ఈ ప్రత్యేక యోగా వేడుకల్లో భారత విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి.కె.సింగ్, బీజింగ్‌లోని ఇండియన్ ఎంబసీ డిప్యూటీ చీఫ్ అమిత్ నారంగ్ పాల్గొని యోగాసనాలు వేశారు. కొన్ని వందల మంది చైనా ఔత్సాహికులు పాల్గొన్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: