తమిళనాట జైల్లో ఉన్న శశికళ వరసగా మూడవసారి దినకరన్ తో ములాఖాత్ అవ్వడం విశేషం. ఆయనతో పాటు సెంథిల్ బాలాజీ, పళనియప్పన్ మాత్రమె కాక ఇతర ఎమ్మెల్యే లు ఒక ఐదుగురు వచ్చి ఆమెని కలిసారు. రాష్ట్రం లో పళనిస్వామి ప్రభుత్వం ఎలా నడుస్తోంది దగ్గర నుంచి అనేక విషయాలు ఆమెతో మాట్లాడారు వాళ్ళు.


అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యే లు ఎంతమంది ,  పార్టీ లో శశి కి వ్యతిరేకంగా ఎంతమంది ఉన్నారు, ప్రభుత్వం ఇంకెన్నాళ్ళు కొనసాగే ఛాన్స్ ఉంది, అవతలవారి బలం ఎంతా తమ బలం ఇంతా ఇలాంటి విషయాలు ఆమెతో చర్చించారు వీరందరూ. ఈ చర్చ పూర్తి అయిన తరవాత మీడియా తో మాట్లాడిన దినకరన్ .. తమ ఫామిలీ లో ఎలాంటి గొడవలూ లేవు అని చెప్పుకొచ్చారు.


లేని పోనీ వివాదాలు కావాలనే మీడియా , ఇతరులు సృష్టిస్తున్నారు అని చెప్పిన ఆయన రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్ సంగతు తానే ఒక నిర్ణయం తీసుకుని పార్టీకి పంపుతాను అన్నారని చెప్పుకొచ్చారు " ఆమె మా మనుషులతో రాష్ట్రపతి ఎన్నికల గురించి నిర్ణయం రాసి ఒక లేఖ ద్వారా పంపుతారు అదే మా తుది నిర్ణయం అవుతుంది" అన్నారు ఆయన.


చిన్నమ్మ తో స్పెషల్ గా పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో అన్నా డీఎంకే ఓటు ఇప్పటికే బీజేపీ కి అనుకూలం అనుకుంటున్నారు అందరూ ఈ పరిస్థితి లో చిన్నమ్మ ఏం సలహా ఇచ్చారు బండి ఎలా నడిపిస్తారు అనేది ఆసక్తికరం.

మరింత సమాచారం తెలుసుకోండి: