ఆంధ్రప్రదేశ్ లో టీటిపి లీడర్ జలీల్ ఖాన్ ఆ మద్య ఓ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఎన్ని సంచలనాలకు తెరలేపిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఆయన కామర్స్ విద్యార్థినని చెబుతూనే..కామర్స్ లో ఫిజిక్స్ ప్రస్తావన తీసుకు రావడం అందరినీ నవ్వించింది.  ఈ అంశంపై ఎంతో మంది సెటైర్లు వేసి నవ్వుకున్నారు.  అంతెందుకు ఏపీ అసెంబ్లీలో కూడా ఈ ప్రస్థావనపై ఫుల్ కామెడీ నడిచింది.  తాజాగా జలీల్ ఖాన్ మరోసారి తన కామెడీతో అందరినీ కడుపుబ్బా నవ్వించాడు.

 వివరాల్లోకి వెళితే..విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జలీల్ ఖాన్ ఆధ్వర్యంలో నిన్న ఇఫ్తార్ విందు కార్యక్రమం జరిగింది. ఈ విందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా వారు సాంప్రదాయంగా ధరించే వస్త్రాలు  టోప్ (మత పెద్దలను గౌరవించి ఇచ్చే దుస్తులు) ను ధరింప జేశారు. ఈ సందర్భంగా చంద్రబాబును చూసి తెగ మెచ్చుకున్న అక్కడి ముస్లిం సోదరులు జయహో.. జోథా అక్బర్' అంటూ నినాదాలు చేశారు.
Image result for jalil khan chandrbabu
ఇక ఇదే మంచి సమయం అనుకున్న జలీల్ ఖాన్ ఇక్కడి నియోజకవర్గంలోని ముస్లింలు అందరూ టీడీపీ వైపే ఉన్నారని చెప్పారు. ముస్లింల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని విన్నవించారు.  పనిలో పనిగా తన భవిష్యత్ కూడా తమరి చేతిలోనే ఉంచుతున్నానని తమరు మాత్రం తన భవిష్యత్ ఎవ్వరి చేతిలో పెట్టకండీ అంటూ దీనంగా అడిగాడు..దీంతో అక్కడున్న చంద్రబాబు తో సహా అందరూ గొల్లున నవ్వుకున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: