Image result for chandrababu nandyala election campaign

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నత స్థానంలో ఉన్నానన్న సంగతి మరిచిపోయారు. రాజ్యాంగ బద్ధమైన సీఎం కుర్చీలో కూర్చొని జనంతో ఓట్ల కోసం బేరాసారాలు మొదలుపెట్టారు. నంద్యాల ఓటర్లను బెదిరించేస్తున్నారు ఉప ఎన్నికల నేపథ్యంలో ముందుగానే ఆ ప్రాంతంలో చుట్టేస్తున్న చంద్రన్న ప్రజలను ఓటు అడుగుతున్న తీరు చూస్తే ఎవరికైనా చిర్రెత్తకమానదు. ప్రజలేదో తన బానిసలు అయినట్టుగా, తను ఏపీకి నియంతను అయినట్టుగా, తన ఇంట్లో సొమ్ము తో వాళ్లందరినీ పోషిస్తున్నట్టుగా మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రజలంతా తనకే ఓటు వేయాలని అంటు న్నారు. 


జిల్లాలో రెండురోజుల పర్యటనలో భాగంగా టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం నంద్యాలలో పార్టీ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. అయితే అదే సమయంలో సీఎంను కలిసేందుకు ప్రజలు అక్కడకు చేరుకుని, తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. అందుకు సీఎం సమస్యల చెప్పడం కాదు వినండంటూ అడ్డుపడ్డారు.


‘రాయలసీమలో ఇప్పటికీ పెత్తందారీ వ్యవస్థే ఉంది. సీమ రాజకీయాలను ప్రక్షాళన చేయడానికి నాయకులను తీసుకొచ్చా. మా కంటే మా తర్వాత తరం నాయకులు మరింత పాజిటివ్‌గా ఉన్నారు. రాజకీయంగా ఇతర పార్టీల నుంచి నాయకులను తీసుకొచ్చాం. నాకు వచ్చిన సమస్య ఏంటంటే నాయకుడు కావాలి, ఎన్నికలు గెలవాలి. గెలవడానికి నాయకుడు కావాలి కాబట్టి మేం కొన్ని రాజీ పడ్డాం. మేం రాజీపడడం వల్ల టీడీపీలో కొంతమందికి నష్టం కూడా జరిగింది.


కొంతమంది నాయకులకు నష్టం జరిగిందని కూర్చున్న చెట్టును నరుక్కుంటామా?   నావల్ల లాభం పొందినవాళ్లంతా మళ్లీ నాకు ఓటేయాలి కదా!. పదేళ్ల కిందే నేను అధికారంలో ఉంటే రాష్ట్రం ఎక్కడికో పోయేది. నేను వెయ్యి పెన్షన్‌​ ఇస్తున్నా. రుణ మాఫీ చేశా, ఎవరు డబ్బిచ్చినా నాకే ఓటేయాలి. నేను తలచుకుంటే ఓటుకు 5వేల రూపాయిలు ఇవ్వగలను, కానీ ఎందుకు ఇవ్వాలి.


‘‘నేనంటే ఇష్టంలేకపోతే మీకెందుకు పనులు చేయాలి? నాకు వ్యతిరేకంగా ఏమైనా గ్రామాలుంటే వాటికో నమస్కారం పెడతా. మీకు ఓటుకు 5వేలు ఇవ్వాలంటే మీ దగ్గరే 5లక్షల చొప్పు వసూలు చేయాలి. నా పించన్లు తింటున్నారు. మేం  వేసిన రోడ్ల మీద నడుస్తున్నారు. నేనిచ్చిన రేషన్ తీసుకుంటున్నారు. అలాంటప్పుడు నాకు ఓటేయాలని అడుగుతున్నా. మీ పరిపాలన నాకు నచ్చలేదు అని అనేవారుంటే ఓకే.  వాళ్ల సంగతి పక్కనబెడదాం. 


మీకు ఓటుకు 5 వేలు ఇవ్వాలంటే మీ దగ్గరే నేను 5 లక్షల చొప్పున వసూలు చేయాలి. నాకు వ్యతిరేకంగా ఏవైనా గ్రామాలుంటే వాటికో నమస్కారం పెడతా. నేనంటే మీకు ఇష్టం లేకపోతే, నేను మీకెందుకు పనులు చేయాలి?. నేనిచ్చిన పెన్షన్‌ తీసుకుంటున్నారు. నేనిచ్చిన రేషన్‌ తీసుకుంటున్నారు. నేను వేసిన రోడ్ల మీద నడుస్తున్నారు, నాకు ఓటేయకుంటే ఎట్లా?. నా పరిపాలన బాగా లేదంటే నేనేమీ తీసుకోను. నాకేమీ వద్దు’ అని అన్నారు.


కర్నూలు జిల్లాలో రెండ్రోజుల పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాబు వ్యాఖ్యలపై ఓ జాతీయ మీడియా ప్రచురించిన కథనాన్ని ఉద్దేశించి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ పేరిట ఉన్న ట్వీటర్‌ అకౌంట్‌ నుంచి స్పందన వచ్చింది. 'బాబు! ప్రజలు మిమ్మల్ని విమర్శించడం రుచించక పోతే వారి నుంచి పన్నులు వసూలు చేయడం ఆపండి, వాళ్లను ఓట్లు అడుక్కోవడం కూడా మానేయండి' ఇది ఆ పోస్టు సారాంశం.


ఇది మాజీ ప్రధాని అధికారిక ట్వీటర్‌ అకౌంటా? లేదా? అన్న విషయం తెలియరాలేదు. ప్రజల సొమ్ముతో అందుకునే పించన్ల ను తీసుకోవద్దని, రోడ్లపై నడవొద్దని బాబు ఎలా అంటారని పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. కర్నూలులో ఆయన చేసిన వ్యాఖ్యలు సరికావని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: