గత కొంత కాలంగా ఆప్ఘనిస్థాన్‌లో లో ఉగ్రదాడులు బాగా పెరిగిపోయాయి.  లక్ష్యం ఏదైనా ఎన్నో వందల మంది అమాయక ప్రజలు చనిపోతున్నారు.  ఆత్మహుతి దాడులు, కారు బాంబులు, కాల్పులు, ఊచకోతలు ఇలా  ఆప్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదులు చెలరేగిపోతున్నారు.  ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదులు ఎప్పుడు ఎక్కడ ఎలా దాడులు చేస్తున్నారో తెలియకుండా ఉంది.  

ఈ మద్య లండన్ లో జరిగిన దాడులు చూస్తే చలించి పోతారు.  తాజాగా ఆప్ఘనిస్థాన్‌లో మిలటరీ ఉద్యోగులు, పౌరులు జీతాలను విత్‌డ్రా చేసుకునేందుకు బ్యాంక్ వద్ద క్యూలో ఉన్న సమయంలో ఈ కారు బాంబు దాడి జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.
CARBOMB-BLAST
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ దాడికి ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించలేదు.ఈ దాడి ఎవరు చేశారన్న విషయం ఇంకా తెలియరాలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: