జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యేక్షంగా పోటీకి దిగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తన పార్టీ పటుత్వాన్ని మరింత పెంచేందుకు పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలను నియమిస్తున్నారు. అయితే వీరి ఎంపికలో పార్టీ కొన్ని నియమ నిబంధలను విధిస్తుంది. పవన్ అన్నయ్య చిరంజీవి కూడా గతంలో ప్రజా రాజ్యం అనే రాజకీయ పార్టీని స్థాపించి ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైన తర్వాత తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం మనమందరం ప్రత్యేక్షంగా చూశాం.



అయితే ప్రజా రాజ్యం పార్టీ చేసిన తప్పులు తన పార్టీలో జరగకుండా చూసుకుంటున్నానని పవన్ చెబుతున్నారు. ఇందులో భాగంగా  జనసేన నిర్మాణాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అటు ఏపీతోపాటు ఇటు తెలంగాణలోనూ జనసేన ఎంపికలు చివరి దశకు వచ్చాయి. జిల్లాలవారీగా స్పీకర్లు, కంటెంట్ రైటర్లు, అనలిస్టుల ఎంపిక కోసం జనసేన శిబిరాల్లో పాల్గొనవారి ప్రతిభను పవన్ స్వయంగా పరిశీలించారు. 



ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతూ పాల‌కులు చేస్తోన్న త‌ప్పుకి ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతుండ‌డం చూసి తాను చ‌లించిపోయానని అన్నారు. ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టిన‌ప్పుడు అందులో జ‌రిగిన త‌ప్పు ఒప్పుల‌ను ప‌రిశీలించానని చెప్పారు. అందులో జ‌రిగిన త‌ప్పుల‌ను మ‌ళ్లీ పున‌రావృతం కాకుండా చూస్తున్నాన‌ని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: