భారత దేశంలో నల్లధనం నిర్మూలన కోసం భారత ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దు చేసి సంచలన నిర్ణయం తీసుకున్నారు.   అంతే కాదు పాత 500, 1000 నోట్ల స్థానంలో కొత్త 500, 2000 నోట్లు తీసుకు వచ్చారు.  ఆ సమయంలో ఎంతో మంది తమ వద్ద ఉన్న డబ్బు తప్పని సరిగా బయటకు తీయాల్సి వచ్చింది.  అయితే పెద్దనోట్ల మార్పు సమయం కొంత వరకు ఇవ్వడంతో చాలా మంది తమ వద్ద ఉన్న నల్లధనం దుర్వినియోగం కూడా చేశారు.  తాజాగా నగరంలో  తెల్లవారుజామున పెద్ద ఎత్తున పాతనోట్లు పట్టుబడటం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో అరెస్టయిన శ్రీనివాసరావు తమకు సన్నిహితుడంటూ వచ్చిన వార్తలపై నటి జీవిత స్పందించారు.

శ్రీనివాసరావు తన తమ్ముడు కాదని, తన తమ్ముడు మురళీ శ్రీనివాస్‌ నెలరోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని ఆమె తెలిపారు. పోలీసులు అరెస్టు చేసిన శ్రీనివాసరావు తమ ఆఫీసులో మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు చెప్పారు.  ``నాకు తెలిసి ఏమీ జ‌ర‌గ‌లేదు. నాకు ఏమీ తెలియ‌దు. మీడియా నుండి న్యూస్ వ‌చ్చే వ‌ర‌కు మాకు న్యూస్ కూడా లేదు.

అస‌లు మీడియా చెబుతున్న ప్లేస్‌లో శ్రీనివాస్ క్రియేష‌న్స్ కాదు జోస్టార్ పేరుతో నా ఆఫీస్ ఉంది. ఈ బ్యాన‌ర్‌లో పిఎస్‌వి గ‌రుడ‌వేగ అనే సినిమా జ‌రుగుతుంది.  మా కంపెనీ త‌ర‌పున ప‌నిచేసే న‌లుగురు మేనేజ‌ర్స్‌లో శ్రీనివాస్ ఒక‌రు. మిగిలిన ముగ్గురు మేనేజ‌ర్స్ పేరు సాయిరాం, వెంక‌ట్‌, బాల‌గోపాల్‌. అస‌లు శ్రీనివాస్‌కు ఏమైంద‌నే విష‌యం అత‌న్నే అడ‌గాలే త‌ప్ప, అత‌ను మా వ‌ద్ద ప‌నిచేస్తున్నాడ‌నే కార‌ణంతో వెంట‌నే జీవిత రాజ‌శేఖ‌ర్ కార్యాలయంలో డ‌బ్బులు దొరికాయ‌ని అంటున్నారు.  నా సినిమా డ‌బ్బింగ్‌, ఎడిటింగ్ వ‌ర్క్ అంతా అన్న‌పూర్ణ‌లో జ‌రుగుతుంది.
The earlier window was open till December 31, a day after the 50-day period of demonetisation of high value currency.
అంద‌రూ జోస్టార్ సినిమాకు, పిఎస్‌వి గ‌రుడవేగ‌కు ప‌నిచేస్తున్న‌ట్లే. నా ద‌గ్గ‌ర ప‌నిచేస్తే నాకు సంబంధం ఉంటుందా, ఈ ఆఫీస్ నాది. అస‌లు శ్రీనివాస క్రియేష‌న్స్ ఎక్క‌డి నుండి వ‌చ్చింది. ఫిలించాంబ‌ర్‌లో కూడా మీరు చెక్ చేసుకోవ‌చ్చు. ఇది చాలా ఇబ్బందిగా ఉంది. నా కుటుంబం క్షేమంగా ఉంది. నాకు ఏ పోలీస్ ఆఫీస‌ర్ ఫోన్ చేయ‌లేదు. నాకు ఏ పోలీస్ స్టేష‌న్ నుండి ఫోన్ రాలేదు. ఇది మీడియా నుండే పుట్టిన వార్త‌`` అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: