Image result for meera kumar lalu nitish


రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం కాదని తేలటంతో ప్రతిపక్షాలు ఐఖ్యంగా తమ అభ్యర్థిగా దళిత మహిళ, మాజీ లోక్‌సభ స్పీకర్‌ మీరా కుమార్‌ను ప్రకటించాయి. విపక్షాల ఐక్యత కోసం అన్నీ వైరి పక్షాలు వ్యూహాత్మకంగా తమతమ పావులు కదుపుతున్నాయి. విపక్షం గూటి నుంచి జారుకొని అధికార ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కు మద్దతు తెలిపిన బిహార్‌ ముఖ్యమంత్రి జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌ను తిరిగి తమవైపు తిప్పుకునే దిశగా వ్యూహాత్మకంగా బీహార్లో లాలు ప్రసాద్ యాదవ్ సహాయం తో అడుగులు వేశాయి. ప్రతిపక్షాల అభ్యర్థి మీరాకుమార్‌కు మద్దతు తెలుపాల్సిందిగా నితీశ్‌ కుమార్కు ప్రతిపక్షాలు ఆనీ కలసి విజ్ఞప్తి చేశాయి.

Image result for meera kumar lalu nitish

"మేం నితీశ్‌ కుమార్ తో శుక్రవారం భేటీ అయి, బిహార్‌ ఆడపడుచు నాటి భారత ఉప ప్రధాని, దళిత నాయకుడు జగజ్జీవన్ రాం బిడ్డ అయిన మీరాకుమార్‌కు మద్దతు తెలుపాల్సిందిగా ఆయనకు విజ్ఞప్తి చేస్తాం" అని లాలూ ప్రసాద్ రాష్ట్రపతి అభ్యర్థిపై ప్రతిపక్షాల భేటీ అనంతరం తెలిపారు. 


"మేం నితీశ్‌ కుమార్ను చారిత్రక తప్పిదాన్ని చేయొద్దంటూ భేటీలో విజ్ఞప్తి చేస్తాం. ఆయన నిర్ణయం తప్పు. పునరాలోచన చేయాల్సిందిగా ఆయనను కోరుతున్నాం. ఆయన ప్రతిపక్ష కూటమి ని విచ్ఛిన్నం చేయకూడదు" అని లాలూ ప్రసాద్ అన్నారు. నితీశ్‌ కుమార్ సంకీర్ణ ప్రభుత్వంలో లాలూ ఆర్జేడీ, కాంగ్రెస్‌ పార్టీ మిత్రపక్షాలుగా ఉన్న సంగతి తెలిసిందే. మిత్ర పక్షాలకు షాక్‌ ఇస్తూ నితీష్ కుమార్ బీజేపీ అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కు మద్దతు పలుకడంతో లాలూ, నితీశ్‌ మధ్య మాటలు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో తిరిగి తమ గూటికే రావాల్సిందిగా లాలూ ప్రసాద్ నితీశ్‌ను కోరుతున్నారు.

Image result for meera kumar lalu nitish

విపక్షాల వ్యుహాలేమైనా వీరి సంఖ్య మాత్రం అతి స్వల్పం. ఈ కొద్ది తామరతంపర విపక్షాలైనా వాటి మధ్య ఐఖ్యత సాధించటం అనితర సాధ్యమే. 

మరింత సమాచారం తెలుసుకోండి: