"మేం వేసిన రోడ్లపై నడుస్తున్నారు

మేం ఇచ్చిన రేషన్ తింటున్నారు

మేం ఇచ్చిన పెన్షన్ తో బ్రతుకుతున్నారు

మేం ఇచ్చిన వీది దీపాల వెలుగులో నడుస్తున్నారు

నావల్ల లాభం పొందినవాళ్లంతా మళ్లీ నాకు ఓటేయాలి కదా!

అలాంటప్పుడు నాకు ఓటేయాలని అడుగుతున్నా.

రుణ మాఫీ చేశా, ఎవరు డబ్బిచ్చినా నాకే ఓటేయాలి.

నేను తలచుకుంటే ఓటుకు 5వేల రూపాయిలు ఇవ్వగలను,

కానీ ఎందుకు ఇవ్వాలి!

మీ పరిపాలన నాకు నచ్చలేదు అని అనేవారుంటే ఓకే.

నేనంటే మీకు ఇష్టం లేకపోతే, నేను మీ కెందుకు పనులు చేయాలి?.

వాళ్ల సంగతి పక్కనబెడదాం"


ఒక ముఖ్యమంత్రి నంద్యాల బహిరంగ సభలో మాట్లడిన మాటల మూటలు. స్వయాన ఆయన నోటినుండి జాలువారిన అమృత గుళికలు. పద ఝరి. మనం ఏ రాజుల కాలం లో ఉన్నామని బహుశ గౌతమీపుత్ర శాతకర్ణి కాలంలో ఉన్నామా? అని గిల్లి చూసుకోని ప్రజాస్వామ్య వాది ఉండరు.   ప్రజలేదో తన బానిసలు అయినట్టుగా, తను అమరావతీ రాజ్యానికి చక్రవర్తి నియంతో  అయినట్టుగా, తన ఇంట్లో సొమ్ముతో వాళ్లందరినీ పోషిస్తున్నట్టుగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు. ప్రజలంతా తనకే ఓటు వేయాలని బాబు అంటున్నాడు.  ప్రజాస్వామ్యంలో ఉన్నాడో లేక నియంతగా చలామణి అవుతున్నానని అనుకుంటున్నాడో కానీ,  చంద్రబాబు మాటలు చోద్యంగా ఉన్నాయి.


నాకు ఓటు వేయనప్పుడు మీకు నేను ఏమైనా నేను ఎందుకు చేయాలి? అని కూడా బాబు ప్రశ్నిస్తున్నారు. మరి తను ముఖ్యమంత్రి పదవిని అలంకరించింది ప్రజలు ఓటు వేయబట్టే కదా? తను యే హోదాలో ఉన్నారో కూడా ఆయన మరిచిపోయారా? తనకెందుకింతటి నిరాశ. యుద్ధం ఓడిపోయిన సుయోధనుని పలుకులిలాగే ఉంటాయి. ఇలాంటి మాటలు ప్రజల్లో జుగుప్సనే కాదు ఆగ్రహాన్ని రగిలిస్తాయి తప్ప అభిమానాన్ని కురిపించవు. ఏ ముఖ్యమంత్రి తన సొమ్ము ప్రజలకు పంచరు. అది ప్రజధనమే. అంతే కాదు నీవు వీళ్ళకు పంచేది మద్యతరగతి ప్రజలు పన్నుల రూపంలో కట్టే వారికష్టార్జితం. క్రింది తరగతికి మీరు అన్నీ ఉచితంగా ఇస్తారు. రైతులకు ఋణమాఫీ చేస్తారు. ఉన్నత తరగతుల వారికి ఋణాలు వన్ టైం సెటిల్-మెంట్స్ రూపంలో కొంత రద్దుచేస్తారు. మరికొందరిని ఎం ఎల్ ఏ, ఎమెల్సి, ఎంపి లుగా చేసి రాష్ట్ర కేంద్రాల్లో కాబినెట్లలో మంత్రులను చేసి దోపిడీకి డోర్లు బార్లా తెరుస్తారు. ఇక్కడకొచ్చి "నేనిచ్చిన మేమిచ్చిన...." అంటూ ఓట్ల సమయములో అమాయకులని బెదిరిస్తారు. అంతా మీ సొమ్మే మేమందరం తింటున్నట్లు మాట్లాడతారు. ఇలా మాట్లాడే మీ రాజకీయ పతనానికి రాచబాటలు వేసుకుంటున్నారని గ్రహిస్తే మంచిది.  మీరు అలామాట్లాడినందుకు మీ పాపాల చిట్టా మీ ముందు ఉంచుతున్నాం. ఙ్జాపకాలు గుర్తొస్తున్నాయ్ రూపంలోనైనా మిమ్మలను మేలుకొలపాలని కోరుతున్నాం. అదీ మీరు మారాలని బాగుపడాలని.


మూడేళ్ల పాలన, ఒక పరిపాలకుడికి తన పాలనలో మూడేళ్లు గడవడం అంటే ఒకరకంగా ఎన్నికల కు సిద్ధమవుతున్న పరిస్థితిని ఎదుర్కోవడమే. ప్రజలు ఆ పాలకుడి ఏలుబడిపై ఒక అంచనాకు రావడమే. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనపై - ఆయన పాలనలోని సానుకూల  వ్యతిరేక కామెంట్లపై విశ్లేషణ ఇది.


ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనను మెచ్చే వర్గాల భావన ప్రకారం ఏపీ సీఎం నవ్యాంధ్ర కేంద్రంగా భవిష్యత్ పాలనకు పునాదులేసుకుంటున్నారు. ఏపీకి కీలకమైన హోదానిచ్చేందుకు కేంద్రం అంగీకరించక అంతకుమించిన ప్రయోజనాల్తో కూడిన ప్యాకేజీని ప్రకటించడంతో తప్పనిసరి అయి ఒప్పుకున్నారని చెప్తున్నారు.


గత మూడేళ్ళలో ప్రపంచ స్థాయి రాజధాని నగరం అమరావతి నిర్మాణానికి తగిన వనరుల్ని సమీకరించుకుని అంతర్జాతీయస్థాయి నిపుణులతో ఈ నగర నిర్మాణానికి ఆకృతుల రూపకల్పన చేయిస్తున్నారని అంటున్నారు.  2019 నాటికి అమరావతి నగరానికో రూపురేఖలు తేవడం ఇప్పుడు చంద్రబాబు ప్రధాన లక్ష్యం కావాలి. అది జరిగినపుడే కలిగిన నష్టాన్ని మించి తమకు చంద్రబాబు ప్రయోజనాలు చేకూర్చగలరన్న నమ్మకం ప్రజల్లో ఏర్పడుతుందని విశ్లేషిస్తున్నారు.

 

ఇక బాబు విమర్శకులు మాత్రం తమ విశ్లేషణలో పలు కోణాలు స్పృశించారు.


1. తన నేరాన్ని న్యాయవాదుల చాకచక్యాన్ని వినియోగించి నేరాన్ని చట్టబద్దం చేయ బూనటం మహానేరం (బ్రీఫ్ద్-మి)

2. ప్రతిపక్ష శాసనసభ్యులను నయాన్నో భయాన్నో ఆశలు కలిపించి చివరకు బెదిరించి తన పార్టి లోకి గోడ దూకించటం అంటే ప్రజాస్వామ్యములో పాప పంకిలమైన హీనకార్యం.

3. గౌతమీపుత్ర శాతకర్ణికి వినోదపన్ను రద్దుచేస్తే ఆ ప్రయోజనం ప్రేక్షకులకు కాకుండా నిర్మాత దర్శకుల జేబుల్లోకి చేర్చటంలో కుల పిచ్చి, బందు ప్రీతి, ప్రాంత అభిమానం, అస్మదీయ ప్రేమ. రుద్రమదేవి సినిమాకు ఆ ప్రయోజనం కలిపించక పోవటం ఇతరకులాలపై ప్రాంతాలపై వ్యతిరెఖ భావన ప్రస్పుటం.

4. మహిళా సాధికారత పై జరిగిన సమావేశాలకు శాసనసభ సభ్యురాలు రోజాకు ఆహ్వానం పంపి మరీ పోలీసుల తో కిడ్నాప్ చేయించటం పెద్ద అపరాధం. అతిధిని ఆహ్వానించటం అవమానించటం ఆంధ్రుల సాంప్రదాయం కాదు.

5. శాసనసభలో అన్-పార్లమెంటరీ బాష ఉపయోగించిందని శాసనసభ్యురాలు రోజాని సంవత్సర కాలం పాటు సభా భహిష్కరణకు గురిచేయటం అలా చేసిన బోండా, దేవినేని, అచ్చన్నయుడు, రావెల, బుద్ధా తదితరులకు ప్రశంసలు యివ్వటం


6. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజిని అంగీకరించటం తో కేంద్రం తో లాలూచి పడి ఆంధ్ర ప్రజలకు తీరని ద్రోహం చేయటం.

7. పది సంవత్సరాలకు పైగా హైదరాబాద్ నుంచి రాజధాని ప్రయోజనాలు పొందే చక్కని కోటాను కోట్ల విలువైన ప్రజా సంపదను తన స్వప్రయోజనాలకు తన తప్పిదాలకు ఫణంగా పెట్టటం

8. వనజాక్షి కేసులో చింతమనేని చేసిన నేరం అపరాషం క్షమించరానిది. అలాంటి ధారుణాన్ని కులమే ప్రధానంగా రక్షించటం.

9. ప్రదానాధ్యాపకుడు బాబురావు క్రౌర్యానికి బలై ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి ఆత్మకు శాంతి కలిగించక పోవటం కులమే ప్రధానం అనే ప్రభుత్వ లక్ష్యంగా చేయటం.

10. డా. శ్రీలక్ష్మి వల్ల - డా. సంధ్య డా. రవి ల ఆత్మహత్య చేసుకున్నా ఆమెపై ఈగ కూడా వాలనివ్వకపోవటం కుల వివక్షకు పరాకాష్ఠ.


11. అనేక పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకవ్వటం ఈ ప్రభుత్వ అసమర్ధతకు ఋజువు. దానికి మంత్రి నారాయణకు చెందిన విద్యాసంస్థల ప్రమేయంపై ప్రజల్లో వెల్లువెత్తిన అనుమానాలకు నివారణ యివ్వకపోవటం నేరాన్ని అంగీకరించటమే.

12. దివాకర్ ట్రావెల్స్ బస్ ప్రమాదములో 20 మంది చనిపోయినా ప్రతిపక్ష నాయకుని చూపి చట్టబద్ధమైన చర్యలు తీసుకోకుండా తన పార్టికి చెందిన జెసి బ్రదర్స్ రోడ్డెక్కి చేసిన అరాచకాన్ని నివారించకపోవటం అత్యంత గర్హనీయం. 

 13.అంతర్జాతీయ అసెంబ్లీ అని ఊదరగొట్టిన సచివాలయంలో ఏడాది కూడా గడవకుండానే ప్రతిపక్ష నాయకుడి ఆఫీసులో బక్కెట్లతో ఎత్తి పోసినట్టు జోరున వాన కురవడం.

14. రికార్డు కాలంలో పూర్తిచేశామని చెప్పుకుంటున్న పట్టిసీమ ప్రాజెక్టులో రూ. 199 కోట్ల భారీ అవినీతి జరిగిందని కాగ్ తేల్చేయడం - అవినీతిలో ఏపీని నెంబర్ వన్ అని తేలడం.

15. గోదావరి పుష్కరాల్లో 30 మంది విగతజీవులుగా మారిపోవడం..లాంటివన్నీ నవ్యాంధ్రకు మాయని వచ్చ అంటున్నారు.


16. చంద్రబాబు ఎన్నికల్లో ఏవైతే హామీలిచ్చారో వాటిలో కీలకమైనవి ముగిసిపోయాయి - మురిగిపోయాయని చెప్తున్నారు.

రైతు రుణమాఫీ –

డ్వాక్రా రుణాల మాఫీ –

నిరుద్యోగ భృతి లాంటి హామీలు అమలు చేస్తానని చెప్పిన బాబు ఏ మేరకు చేశారో గ్రామాలకెళ్లి ఎవర్నడిగినా తమకు జరిగిన అన్యాయం ఏకరువు పెడతారు.

17. అధికారంలోకి వస్తే బేషరతుగా రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన బాబు లబ్ధిదారుల పేరుతో రైతులను అనర్హులుగా ప్రకటించారు. నామమాత్ర రుణమాఫీ పొందిన రైతులకు కూడా ఇచ్చిన డబ్బు వడ్డీలకే సరిపోవడం లేదు. కౌలు రైతుల పరిస్థితి సరేసరి. డ్వాక్రా మహిళలకురుణమాఫీ చేస్తానని చెప్పి ఇన్వెస్టమెంట్ ఫండ్ పేరుతో పదివేలు మూడు విడతలుగా ఇస్తున్నాడు.

18. చంద్రబాబు విలాసవంతమైన బంగ్లా కట్టుకుంటే పక్కా ఇంటి కోసం ఎదురు చూస్తున్న సామాన్యుడు ఇప్పటికీ ఇళ్లు ఎప్పుడు మంజూరు చేస్తారా అని ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడని పలువురు ఉదహరిస్తున్నారు.

19.పేద రాష్ట్రంలో ఉన్నాం.. ఖర్చులు తగ్గించుకోవాలని జనాలకు చెప్పే బాబు మాత్రం నాలుగైదు కిలోమీటర్లకు కూడా హెలికాఫ్టర్ లో తిరుగుతున్నారని రూ. 5 కోట్లతో ఇంటిని తలపించే బస్సును ఏర్పాటు చేసుకున్నారని... అదే సామాన్యుడు ఆర్టీసీ బస్సుల్లో తిరగడానికి కూడా ఛార్జీలు అందు బాటులో ఉండవని ఆగ్రహిస్తున్నారు. 

20. ఒకప్పుడు పేదోడికి సంజీవనిగా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఆరోగ్య శ్రీ పథకం ఎందుకూ కొరకాకుండా పోయింది. ఆస్పత్రులకు చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్లో ఉండటంతో వారు ఉచిత   వైద్యానికి ముందుకు రావడం లేదు.



21. నిరుద్యోగ భృతి కోసం బడ్జెట్ లో ప్రవేశపెట్టిన రూ. 500 కోట్లకు ఇప్పటికీ విధివిధానాలు రూపొందించనేలేదు. 

22. “జాబు రావాలంటే బాబు రావాలని” ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన టీడీపీ తీరా అధికారంలోకి వచ్చాక ఎంతోమంది ఆరోగ్యమిత్రలను ఉద్యోగాల్లోంచి తీసేశారు.

23. హాజరు పేరుతో 9 వేల పాఠశాలలకు తాళాలు సిద్ధంగా ఉన్నాయి. ఎంతో మంది కాంట్రాక్టు ఉద్యోగులు క్రమబద్ధీకరించమని పోరాడుతూనే ఉన్నారు.

24. ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరుతో రూ. 2లకు 20 లీటర్ల మంచినీరు ఇస్తామన్నహామీ ఎన్ని చోట్ల అమలు చేస్తున్నారో పాలకులకే ఎరుక.

25. గత ప్రభుత్వం చేపట్టిన ఐదూ పది శాతం అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరిగాయ తప్ప కొత్తగా కట్టిందేమీ లేదు. ముచ్చుమ్రరి - పైడిపాలెం ప్రాజెక్టులు గత ప్రభుత్వ హయాంలోనే దాదాపు 90 శాతం పూర్తయినై .


26. పట్టిసీమ కాలువ పనులు కూడా ఏడెనిమిది కిమీలు మినహా అప్పుడు పూర్తి చేసిందేననే అభిప్రాయం చాలా మందిలో ఉంది. 2013 చట్టం ప్రకారం వారికి నష్ట పరిహారం చెల్లించాల్సి వున్నా అమలు అంతంత మాత్రంగానే ఉంది.

27. పోలవరం వంశధార నిర్వాసిత రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాల్సి ఉన్నా వారికి ఇప్పటికీ అందక దానికోసం పోరాడుతూనే ఉన్నారు.

28.అధికారులు తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ జన్మభూమి కమిటీలకు అప్పగించేసి తెలుగు తమ్ముళ్లు ప్రజలపై పెత్తనం చేసేలా చట్టాలు మార్చారు.

29. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు రక్షణ లేని పరిస్థితి ఉందనేది అనేకమందిలో ఉన్న భావన. నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి సీనియర్ల వేధింపులతో ఆత్మహత్య చేసుకుంది.

30.  విమర్శలు సహించక కక్షతీర్చుకునే ధోరణి పార్టిని ఏ తీరాలకు చేరుస్తుందో తెలుయని పరిస్థితి. పొలిటికల్ పంచ్ అడ్మిన్ ఇంటూరి రవికిరణ్, మాజీ ముఖ్య కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు పై ప్రభుత్వం ప్రవర్తించిన తీరే సామాజిక సమాచార వ్యవస్థను మరింత వేగవంతం చేసే పరిస్థితులు మరింతగా పుంజుకొంటున్నాయి.


తహసీల్దార్ వనజాక్షిని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అవమానిస్తే విచారణ లేదు. 

టీడీపీ నాయకులు ఆగడాలకు మాచర్ల జడ్పీ చైర్పర్సన్ శ్రీదేవి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని విమర్శలు చేస్తున్నవారు ఉన్నారు.

బాపట్ల విజేతమ్మ గుంటూరు జడ్పీచైర్ పర్సన్ జానీమూన్ వంటి వారు లోకేష్ కు చెప్పినా న్యాయం జరగడం లేదని మీడియా ముందుకొచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

మాజీ మంత్రి రావెల కిషోర్ కొడుకు తప్పతాగి ఓ మహిళను వేధించినా అతనిపై చర్యలు లేవని ఇటీవలే వార్తలు వచ్చాయి. 

బోండా ఉమ తనయుని అరాచాకాలపై చర్యలు లేవు. 

డా. శ్రీలక్ష్మి వల్ల - డా. సంధ్య డా. రవి ల ఆత్మహత్య చేసుకున్నా ఆమెపై ఈగ కూడా వాలనివ్వకపోవటం కుల వివక్షకు పరాకాష్ఠ.

ఇదంతా ఒక ఎత్తయితే సాక్ష్యాత్తు టీడీపీ ఎంపీ శివప్రసాద్ కూతురు డాక్టర్ మాధవీలత తనను మాజీ మంత్రి బొజ్జల అనుచరులు బెదిరించారని.. న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించినా దిక్కులేదని మండిపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: