Image result for opposition presidential candidate

బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ప్లేట్ ఫిరాయించారు. దళిత మేధావి రామ్‌నాధ్ కోవింద్‌ను ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించిన వెంటనే ఆమె మంచి ఎంపిక గా (గుడ్ ఛాయిస్) ప్రశంసించారు. దీంతో అన్నీ పక్షాలు ప్రజలు అంతా ఆమె కోవింద్‌కు మద్దతిస్తున్నారనే భావించారు. దళిత మేధావి కావడం, అన్నింటికీ మించి వివాద రహితుడు కావడంతో ఆయనకు మాయావతి మద్దతిస్తున్నారని అంతా భావించారు. అయితే ఇంతలోనే యూపిఏ రాష్ట్రపతి అభ్యర్ధిగా లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్‌ను ప్రకటించడంతో మాయ తీరు ఒక్క సారిగా మారిపోయింది. బహుశ మీరా బిహార్ బిడ్డ కావటం కూడా ఒక కారణం కావచ్చు. తన మద్దతు మీరా కుమార్‌ కే నంటూ ట్విస్ట్ ఇచ్చారు.

Image result for mayawati

దీంతో మాయ మాట మార్చారని సోషల్ మీడియా లో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆమె కోవింద్ ఎంపికపై స్పందిస్తూ గుడ్ ఛాయిస్ అన్నారు తప్ప మద్దతు ప్రకటించలేదు కదా? అంటున్నారు కొందరు. కానీ ఆమె మాటలు రామ్‌నాధ్ కోవింద్‌ కు మద్దతు ఇస్తున్నట్లున్నాయి తప్ప వ్యతిరేకిస్తున్నట్లు లేవని మరి కొందరు స్పందిస్తున్నారు. మద్దతిచ్చే ఉద్దేశం లేనప్పుడు ఆ ప్రశంస మాత్రం ఎందుకని? మరికొందరు వ్యాఖ్యానిస్తూ ఆమెవి ఎప్పుడూ మాయ మాటలేనని ముక్తాయించారు. అయినా ఈ బిఎస్పి అధినేత మాటలెప్పుడూ నిలకడగా ఉండవనేది మరోసారి ఋజువైంది.

Image result for opposition presidential candidate

మరింత సమాచారం తెలుసుకోండి: