Image result for nara lokesh at national flag hoisting in tirupati


మానవుడు సంఘజీవి. సంఘంతో పాటు తాను ఎదుగుతాడు. ప్రతి మనిషికి అన్నీ విషయాలు తెలియవు. కొన్ని పనులు పద్దతులు మినిమం కామన్సెన్స్ తో కొన్ని ఇతరుల ను చూసి, కొన్ని తెలుసుకొని నేర్చుకుంటాం. ఎమెల్సి అయి ఆ తరవాత మంత్రి అయ్యి అనేక పార్టీ మీటింగుల్లో ప్రజా సమావేశాల్లొ పాల్గొన్న నారా లోకెష్ రాజకీయ సాంప్రదాయాలు, సాంస్కృతిక పద్దతులు తెలుసుకోలేక పోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. "అయ్యవారేమి చేస్తున్నారంటే చేసిన తప్పులు సరిదిద్దుకుంటు న్నారు అనేలా కూడా వ్యవహరించటం లేదు"  తప్పులపై తప్పుల పరంపర కొనసాగిస్తున్నారు. 


తను తనను సంస్కరించుకోవటం మానేసి, తప్పులు చేస్తే ప్రజాస్వామ్య సమాజం వ్యంగ్యం మాటలు, రాతలు, బొమ్మల రూపంలో బయటపెడుతుంది. "సమాజం కోసం రాజకీయం. రాజకీయం కోసం సమాజం కాదు" ఒక నాయకుడు తప్పుగా ప్రవర్తించటం జరిగితే సామాజిక మాధ్యమం అటాడుకోవటం సహజాతి సహజం.



అలాంటి వ్యంగ్య రచనలు చేసిన వారిపై చేతిలో అధికారం, డబ్బు, పోలీసులు ఉన్నారని వార్ని తెచ్చి జైలులో వేసి వేదించటం ప్రభుత్వానికి అప్రతిష్టే. దానికి బదులు తనలోనే మార్పు తెచ్చుకుంటే మంచిదికదా?  అంటున్నారు విఙ్జులు.


అయితే అయ్యవారు కొత్తగా ఏమి చేశారంటే:  

 
ఆంధ్రా ఐటీ, పంచాయతీరాజ్ శాఖామంత్రి నారా లోకేష్ మరోవివాదంలో చిక్కుకున్నారు. ఓ ప్రభుత్వకార్యక్రమంలో జాతీయ జెండాను అగౌరవపరిచే విధంగా ప్రవర్తించారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిన్న, అంటే జూన్ 22న  తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం ఆవరణలో ఏర్పాటు చేసిన వంద అడుగుల ఎత్తైన భారీ జాతీయ జండాను  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా, జాతీయగీతం ప్లే అవుతున్న సమయంలో, అందరూ జెండాకు గౌరవ వందనం చేస్తుండగా, ఈ మంత్రివర్యులు లోకేష్ తనకు ఏమాత్రం పట్టనట్లు అలాగే నిలబడి పోయారు.


ముఖ్యమంత్రి తో పాటు కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ త్రివర్ణ పతాకానికి 3 నిమిషాల పాటు గౌరవ వందనం సమర్పించ గా, ఈ యువ మంత్రి మాత్రం నిశబ్దంగా ఉండి పోయారు. ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలో లోకేశ్, తన తండ్రి చంద్ర బాబు నాయుడి వెనకనే నిలబడి ఉండటం గమనార్హం. అయినా తండ్రిని చూసికూడా నేర్చుకోలేని తదనుగుణంగా ప్రవర్తిం చటం కూడా తెలియని వ్యక్తి మంత్రి పదవిలోఉండటం శోచనీయమే. జాతీయజెండాను అగౌరవ పరిచే రీతిలో లోకేశ్ వ్యవహ రించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. గౌరవప్రదం కూడా కాదు. 

Image result for nara lokesh at Tirupati International airport flag hoisting

మరింత సమాచారం తెలుసుకోండి: