ఇప్పటి వరకు జమ్మూ-కాశ్మీర్ లో ఎన్నో అల్లర్లు జరిగాయి..ముఖ్యంగా గత కొంత కాలంగా ఉగ్రవాదుల దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు జమ్మూ-కాశ్మీర్ కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.  తాజాగా శ్రీనగర్‌లో దారుణం జరిగింది. జామై మసీదు వద్ద విధి నిర్వహణలో ఉన్న పోలీసు ఆఫీసర్‌పై అల్లరిమూకలు దాడి చేశారు. అల్లరిమూకల దాడిలో పోలీసు అధికారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటన గురువారం సాయంత్రం జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగు చూసింది. మృతుడిని డిప్యూటీ సూపరింటెండెంట్ మహ్మద్ అయుబ్ పండిట్‌గా పోలీసులు గుర్తించారు.  డిప్యూటీ సూపరిండెంట్‌గా పనిచేస్తున్న మహ్మద్‌ ఆయుబ్‌ పండిత్‌ గురువారం రాత్రి జమియా మసీదు బయట ఫొటోలు తీసుకుంటుండగా.. ఆందోళనకారులు ఆయనను పట్టుకునేందుకు ప్రయత్నించారు.

దీంతో ఆయుబ్‌ తన తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు యత్నించగా అడ్డుకున్న ఆందోళనకారులు ఆయనపై దాడి చేశారు.
పోలీసు ధరించిన దుస్తులను చించి.. ఆయనను కొట్టి చంపేశారు.ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జామై మసీదు వద్ద పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: