జబర్దస్త్ ఫేం, యాంకర్ గా రాణిస్తూ, బుల్లి తెర అభిమానుల మన్ననలను చూరగొంటున్న భామ రష్మీ. తాను సినిమా పరిశ్రమలోకి అడుగిడికి 14 సంవత్సరాలు ముగుస్తున్నా ఆమెకు అమితంగా గుర్తింపు ఇచ్చింది మాత్రం జబర్దస్త్ కామెడీ ప్రోగ్రాం మాత్రమే. అయితే సెలబ్రిటీలు అన్నాక రూమర్లు సహజం. ఇంకా పెళ్లి కాని అమ్మాయిలు అయితే రూమర్లకు కొదవే లేదు. వారి పెళ్లి పై వచ్చే పుకార్లు అంతా ఇంతా కాదు. సరిగ్గా రష్మీ కూడా ఇదే కోవకు చెందుతుంది.


Image result for rashmi jabardasth

రష్మీ పెళ్లిపై ఇప్పటివరకు చాలా పుకార్లు సోషల్ మీడియా లో షికార్లు చేశాయి. వీటికి ఒక సరికొత్త పుకార్ తోడైంది. అదేంటంటే.. రష్మీ వైజాగ్ కు చెందిన కుర్రాడిని పెళ్లాడబోతోందనే వార్తలు వెలువడ్డాయి. దీనిపై ఈ భామ స్పందించింది. తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలు లేవని ఈ జబర్దస్త్ భామ స్పష్టం చేసింది. తన పని పట్ల తాను చాలా సంతోషంగా ఉన్నానని... పెళ్లి గురించి తాను ఆలోచించడం లేదని చెప్పింది.


Image result for rashmi jabardasth

కానీ తనకు వైజాగ్ అంటే మాత్రం చాలా ఇష్టం అని, ఎప్పటికైనా వైజాగ్ లో సెటిల్ అవ్వడం అంటే తనకు ఇష్టం అని చెప్పింది. తల్లిదండ్రులు, బంధువులు అంతా వైజాగ్ లోనే ఉన్నారని చెప్పింది. ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా ఆరు నెలలకు ఒకసారి తాను వైజాగ్ కు వెళతానని తెలిపింది. బుల్లి తెర కారణంగానే తను నేడు ఈ స్థాయికి ఎదిగానని, ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా పాపులర్ కావాలంటే మాత్రం బుల్లి తెరపై కనబడాలని, బుల్లి తెర ప్రేక్షకులను మెప్పిస్తేనే, వారు వెండి తెరపై రాణిస్తారని తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: