Image result for Dr. aneeqa ghani


మనం అమెరికాలోని శ్వేతజాతి ఉరహంకారాన్ని నిరసిస్తాం. భారత్ లోనూ జాతికి ఇలాంటి జబ్బు బాగానే చేస్తుంది. సాధారణం గా ఎవరెలా తగలడ్డా డాక్టర్ కమ్యూనిటీలో ఈ జబ్బు శరవేగం గా వ్యాప్తిచెందుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. 


ముంబయికి చెందిన ముస్లిం మహిళా డాక్టర్‌ ట్విటర్‌ వాగ్వాదంలో నోరుజారి ఇబ్బందుల్లో ఇరుక్కున్నారు.


"కీర్తన్‌! ఇంకోసారి నువ్వు ఇస్లాం గురించి మాట్లాడావంటే మా డయాలసిస్‌ వార్డులో రక్త శుద్ధి చేయించు కుంటున్న హిందూ రోగులందర్నీ వెళ్ల గొట్టేస్తా. చచ్చి ఊరుకుంటారు" అని వైద్యురాలైన అనీఖా ఘనీ వ్యాఖ్యానించారు.


Image result for Dr. aneeqa ghani




అసలు స్త్రీని మనం ఒక మాతృమూర్తిగా చూస్తాం.  అసలు కఠిన పదాలు కర్కశత్వం ఆమె నుండి ఊహించం. 


ముస్లిముల మీద ఫేస్‌బుక్‌ వేదికగా దాడికి దిగే పిరికి వాళ్లంతా నేరుగా పాకిస్థాన్‌కు వెళ్లి యుద్ధం చేయాలని సలహా ఇచ్చారు. అనీఖా ఘనీ వ్యాఖ్యలు దుమారం సృష్టించాయి. ఆమెపై భారతీయ వైద్యుల సంఘానికి పలు ఫిర్యాదులు వచ్చాయి.


ఆమె ఐఎంఏ సభ్యురాలు గానీ, మహారాష్ట్ర వైద్య మండలి సభ్యురాలు గానీ కాదు. దాంతో ముందు ఆమె డిగ్రీ అసలుదో నకిలీదో తేల్చాలని ఐఎంఏ, ఎంసీఐని కోరింది. మత ప్రాతిపదికన వైద్యం నిరాకరించడం మెడికల్‌ కౌన్సిల్‌ నిబంధనల ప్రకారం నేర మని, డాక్టర్‌ అనీఖా ఘనీ పై చర్యలు తప్పవని చెబుతున్నారు.

Image result for Dr. aneeqa ghani


మరింత సమాచారం తెలుసుకోండి: