Image result for abraham lincoln john wilkes booth photo


బహుశ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై విశ్వవ్యాప్తంగా ప్రజల్లో అసంతృప్తి ప్రభలుతున్న సూచనలకే ఋజువు హాలీవుడ్ న‌టుడు జానీ డెప్ చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్య. అయితే ఈ వ్యాఖ్య చేసి హాలీవుడ్ న‌టుడు జానీ డెప్ వివాదంలో చిక్కుకున్నాడు. అత‌ను స‌ర‌దాగా చేసిన కామెంట్స్‌, ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. "అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపాల్సిన టైమ్ ఇప్పుడు వ‌చ్చింద‌ని" జానీ డెప్ ఓ ప్రోగ్రామ్‌లో అన్నాడు. 


బ్రిట‌న్‌ లోని గ్లాస్ట‌న్‌బ‌రీ మ్యూజిక్ ఫెస్టివ‌ల్‌ లో జానీ డెప్ పాల్గొన్నాడు. ఈ సంద‌ర్భంగా అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి చ‌ర్చ వ‌చ్చింది. మామూలుగా అడుగుతున్నా ఒక న‌టుడు అమెరికా దేశాధ్యక్షుని హ‌త్య చేయ‌క ఎన్ని రోజుల‌వుతున్న‌ది అని డెప్ అక్క‌డి ఆడియెన్స్‌ను ప్ర‌శ్నించాడు. ఆ ప్రశ్న విన్న ఆడియన్స్ విస్తుపోతుండగానే తాను న‌టుణ్ణి కాద‌ని, బ‌త‌క‌డం కోసం అబ‌ద్ధ‌మాడ‌తాన‌ని, అయినా ఒక న‌టుడు అధ్య‌క్షున్ని చంపి చాలా రోజులైంది, ఇప్పుడు ఆ స‌మ‌యం మ‌ళ్లీ వ‌చ్చింది అని డెప్ అన్నాడు. 


Image result for donald trump


1865లో అప్ప‌టి అధ్య‌క్షుడు అబ్ర‌హం లింక‌న్‌ను జాన్ విల్కిస్ బూత్ అనే న‌టుడు హ‌త్య చేసిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌ను ఉద్దేశించి డెప్ ఈ ప్ర‌శ్న వేశాడు. 


Image result for abraham lincoln john wilkes booth photo

అత‌ను స‌ర‌దాగా చేసిన ఈ కామెంట్స్ వివాడాస్పదమ‌వుతున్నాయి. నిజానికి ఇది పెద్ద వివాదమే కాదు ధుమారమే రేపుతుందని జానీ కి కూడా ముందే తెలుసు. అందుకే "నేను మాట్లాడ‌ బోయేది మీడియా లో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది అది కూడా భ‌యంక‌రంగా ఉంటుంది" అని డెప్ ముందే చెప్ప‌డం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: