తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రోజు రోజుకీ ముదిరిపోతుంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మద్య హోరా హోరి యుద్దం కొనసాగుతుంది.  ఏ చిన్న చాన్స్ దొరికినా అధికారి పార్టీని ఉతికి ఆరేస్తుంది..ప్రతిపక్షం.  ముఖ్యంగా వైఎస్ జగన్, ఎమ్మెల్యే రోజా ఇద్దరూ చంద్రబాబుని టార్గెట్ చేస్తూ ఎన్నో సంచలనాలకు నాంది పలికారు.  ఇక సందిట్లో సడేమియా అంటూ జనసేన పార్టీ కూడా రాబోయే ఎలక్షన్లలో తమ సత్తా చాటాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది.
Image result for tdp

ఆ మద్య చాలా మంది నాయకులు వైసీపీ నుంచి అధికార పార్టీ టీడిపీలోకి జంప్ అయిన విషయం తెలిసిందే.  దీంతో టీడిపీ ఆంధ్రప్రదేశ్ లో కీలక ప్రాంతాల్లో మంచి బలం పుంజుకుంది.  అంతే కాదు ఈ మద్య ఓ సర్వేలో ప్రస్తుత ఎమ్మెల్యేలు మరోసారి పోటీలో నిలబడితే..ఖచ్చితంగా గెలుస్తారని సర్వేలో తేలింది. మరి దీనిపై భవిష్యత్ లో వైసీసీ ఎలాంటి వ్యూహాలు అమలు పరచాలి అన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. 
Image result for ysrcp

ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కల్యాన్ సభ్యత్వం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  వచ్చే ఎన్నికల్లో అనంతపూర్ నుంచి పోటీ చేయబోతున్నా అని ఇప్పటికే ప్రకటించారు.  ఇటీవల జగన్ చేపట్టిన సర్వేలో రోజాకి తక్కువ మార్కులు రావడంతో అధినేత గట్టిగా క్లాస్ ఇవ్వడం, దీంతో ఆ పార్టీ విశాఖలో చేపట్టిన ధర్నాకు ఆమె ఎస్కేప్ అయ్యిందంటూ ప్రచారం సాగింది. నా ఆరోగ్యం కారణంగానే ధర్నాకు హాజరుకాలేదని రోజా క్లారిటీ ఇవ్వడంతో ఆ వివాదానికి ఫుల్‌స్టాప్ పడింది.

Image result for jenasena
అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.  ఎమ్మెల్యే రోజా పార్టీ మారబోతుందని ఆమె జనసేన వైపు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఒకవేళ జనసేనలోకి వెళ్తే ఈసారి ఎంపీగా పోటీ చేయాలని రోజా స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. అదృష్టం బాగుండి జనసేన లీడ్ లోకి వస్తే..ఢిల్లీలో చక్రం కూడా తిప్పొచ్చు అన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.  ఈ మద్య సెలబ్రెటీలపై రూమర్లు విపరీతంగా వస్తున్నాయి..మరి ఈ వార్తలో ఎంత నిజముందో రాబోయే రోజుల్లో తెలియాల్సి ఉంది.  ఏది ఏమైనా రాజకీయల్లో అధికారంలోకి వచ్చిన పార్టీల్లో జంపింగ్ లు కామన్ అని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: