వస్తు సేవల పన్ను - GST విషయం లో మోడీ సర్కారు ఎలాంటి పరిస్థితి లో వెనక్కి తగ్గేలగా కనపడ్డం లేదు.రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు దేశం లో ఏ రాష్ట్రానికీ ఇది మింగుడు పడే విషయం కాకపోయినా కూడా సమ్మతి తీర్మానాలు ఇవ్వాల్సిన గత్యంతరం ఏర్పడింది. కీలక అంశాలలో జీఎస్టీ కి సపోర్ట్ ఇవ్వడం అనేది కుదరని పరిస్థితి. కొందరి వాదన చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది కూడా  పన్ను ఎగవేతదారులను కట్టడి చేయడం వినియోగదారుడికి అక్కడో పన్ను - ఇక్కడో పన్ను అన్న వరుస బాదుడు లేకుండా చేయడం వరకైతే జీఎస్టీ బాగానే ఉన్నా.


వ్యవసాయాన్ని ఇందులోంచి మినహాయించినట్టే చేనేత రంగానికి కూడా గ్యాప్ ఇవ్వాలి అంటున్నారు. ఈ పన్ను విధానం తో అసలే కుంటుతున్న చేనేత రంగానికి ఎలాంటి దారుణాలు ఎదురు అవుతాయో అని అనిపిస్తోంది. కేంద్రం రూపొందించిన డ్రాఫ్ట్ ప్రకారమే జీఎస్టీ పన్ను విధానం అమలైతే... చేనేత రంగం దాదాపుగా అంతరించిపోవడం ఖాయమే.


అందరూ ఈ విషయం మీద సైలెంట్ గా ఉన్న తరుణం లో ఏపీ విపక్ష నేత వైకాపా లీడర్ జగన్ మోహన్ రెడ్డి గళం విప్పారు. ఆయన కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ కి ఒక లెటర్ రాసారు. చేనేత రంగానికి సంబందించిన ఎవ్వరికే అంత పన్ను కట్టే పరిస్థితి ఉండదు అంటున్నారు ఆగం. జీఎస్టీ డ్రాఫ్ట్ బిల్లు ప్రకారం పన్నులు అమలైతే చేనేత రంగం చచ్చిపోవడం ఖాయమంటూ ఆ లేఖలో జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశం లో వ్యవసాయానికి ఎంత ఆసరా కావాలో అంతే ఆసరా చేనేత రంగానికి కూడా కావాల్సి ఉంది.


అలాంటి చోట చేనేత రంగం కి సపోర్ట్ ఇవ్వాల్సింది పోయి కొత్త తలనొప్పులు సృష్టించే పరిస్థితి ఏర్పడింది . ఇది పూర్తిగా పోవాలి అంటున్నారు జగన్. అయితే ఈ విషయం లో జగన్ కి ఎవ్వరైనా సపోర్ట్ చెయ్యాల్సిందే. చేనేత ని gst లోంచి బయట పడెయ్యాలి అని ఇప్పటి వరకూ ఎవ్వరూ అనలేదు జగన్ గళం విప్పారు. ఇలాంటి న్యాయబద్దమైన పోరాటానికి జగన్ దిగితే చంద్రబాబు ఐన సపోర్ట్ ఇవ్వాలి మరి .

మరింత సమాచారం తెలుసుకోండి: