రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం కొత్వాల్‌గూడ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్ పై జరిగిన రోడ్డుప్రమాదంలో సినీనటుడు రవితేజ సోదరుడు భరత్‌ మృతిచెందారు. రహదారిపై ఆగి వున్న లారీని భరత్‌ ప్రయాణిస్తున్న స్కోడా కారు (టీఎస్‌09 ఈసీ 0799) వేగంగా ఢీకొంది. కారు సగ భాగం లారీ కిందకు దూసుకెళ్లడంతో భరత్‌ అక్కడికక్కడే మృతిచెందారు. శంషాబాద్ లోని నోవాటెల్ నుంచి సిటికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

bharat raviteja brother died in accident కోసం చిత్ర ఫలితం
అర్థరాత్రి గస్తీ తిరుగుతున్న పెట్రోలింగ్‌ సిబ్బంది ఈ ఘటనను గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆర్‌జీఐఏ పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని మృతదేహాన్ని కారులో నుంచి బయటకు తీసి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆర్‌జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణం గా పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నా రు.


భరత్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పలు చిత్రాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించిన భరత్, తెలుగు సిసీ ప్రేక్షకులకు సుపరిచితుడు. ఒక్కడే, అతడే ఒక సైన్యం, పెదబాబు, దోచెయ్ లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించాడు. గతంలో పలు వివాదాల్లోనూ భరత్ పేరు ప్రముఖంగా వినిపించింది.

bharat raviteja brother died in accident కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: