transstroy rayapati కోసం చిత్ర ఫలితం


అపనమ్మకానికి అవిశ్వాసానికి ప్రజాధనానికి ఎసరుపెట్టటంలో ఈ రాజకీయ నాయకులు సిద్దహస్తులని 125 కోట్ల భారత ప్రజలకు తెలుసు. తనే అనేక ఆరోపణలతో తన మునకలౌతూ తన అధినేత మెప్పుపొందటానికి ఈ రాజకీయ నాయకులు చేసే విన్యాసాలు ప్రజలు సిగ్గుపడేలా ఉంటాయి. 

transstroy rayapati కోసం చిత్ర ఫలితం

ట్రాన్స్-ట్రొయ్  కంపనీ ద్వారా ఈయన కుటుంబం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చేసిన ద్రోహం అంతా ఇంతా కాదని, టిడిపిలోకి చేరిందీ తన వ్యాపార రక్షణ కోసమేనని రాజకీయ పదవుల కోసమేనని అంటూ ఉంటారు. రాష్ట్ర విభజనకు వీరి లాంటి వాళ్ళ ఆర్ధిక దోపిడీ కూడా ప్రధాన కారణమని వీరి పాత్ర కూడా గణనీయమేనని తెలంగాణాలో చాలా ప్రచారంలో ఉంది. ఈసారు కామ లీలలు తారా చౌదరి వీడియో / ఆడియో టేపుల్లో గొప్పగా విన్నాం. టెలివిజన్ లలో కనులారా వీక్షించి తరించాం కదా!

rayapati vs iyr krishna rao కోసం చిత్ర ఫలితం

మీకు రాజకీయమా? వ్యాపారమా? అని ప్రశ్నిస్తే తెరపై రాజకీయం, తెరవెనుక వ్యాపారం మద్యలో అనేక అద్భుత అనుభవాలు కోరుకునే వాళ్ళలో ఇలాంటివాళ్ళే ఉంటారు.  ఇలాంటి అకళంక చరిత్ర ఉన్న వ్యక్తి ఐ వై ఆర్ కృష్ణారావుపై ఆరోపణలు చేయటం కడుంగడు శోచనీయమనేది సకల తెలుగుప్రజల నమ్మకం. ఈయన ఆరోపణలు విని హతవిధీ! అని ప్రజలు తలలు పట్టుకుంటున్నారు.

rayapati is a danger to the nation కోసం చిత్ర ఫలితం


ఈసారుకి ఇంకా టిటిడి అధ్యక్ష పదవి కూడా కావాలని చాలా ప్రయత్నించారు. దానికోసం తమ ఎంపి పదవి కూడా వదులు కుంటా మన్నారు. అహా! ఎంత త్యాగం అనిపిం చింది.  అయితే సారు "తన చూపుడు వేలుతో ఐవైఆర్ కృష్ణారావు ను చూపిస్తూ చేసిన వ్యాఖ్యలు మిగిలిన నాలుగు వేళ్ళూ తనకు తెలియకుండానే తననే టార్గెట్ చేశాయనే భావాన్ని"  విపక్షాలు ఇబ్బడి ముబ్బడిగా విమర్శించాయి. అయితే: 


rayapati vs iyr krishna rao కోసం చిత్ర ఫలితం


తనపై ఆరోపణలు చేసిన నరసరావు పేట టిడిపి ఎమ్.పి రాయపాటి సాంబశివరావుకు బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు సమాదానం ఇచ్చారు. తనకు దొనకొండ వద్ద భూములు ఉన్నాయని రాయపాటి ఆరోపించారని, తనకు అక్కడ ఎలాంటి భూములు లేవని ఆయన అన్నారు.రాయపాటి అబద్దాలు చెబుతున్నారని, అబద్దాన్ని నిజం చేయాలని అనుకోవడం టిడిపి నేతలకు అలవాటైందని కృష్ణారావు వ్యాఖ్యానించారు.


మంత్రులు, ప్రజా ప్రతినిదులు ఏవైనా ఆరోపణలు చేసే ముందు ఆలోచించి చేయాలని ఆయన సూచించారు.రాయపాటి ఆరోపణలపై ముఖ్యమంత్రి విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి వాటి వల్ల తన మనోభావాలు దెబ్బ తినడమే కాదని, ప్రభుత్వంలో ఉన్న చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయని కృష్ణారావు పేర్కొన్నారు.విశాఖలో కేంద్రం నుంచి తీసు కున్న భూమిని ప్రైవేటు వారికి ఇవ్వడం సరికాదని ఆయన అబిప్రాయపడ్డారు.


rayapati vs iyr krishna rao కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: