భూమిపై జన్మించిన ప్రతి మనిషికి గత జన్మతో అంటూ ఒకటుంటుందని ఆ జన్మలో చేసిన పాపాలు, పుణ్యాల ఫలితాలే ఈ జన్మలో అనుభవిస్తారని పెద్దలు చెబుతుంటారు.  అంతే కాదు ఈ జన్మలో మనం చేసిన పాప, పుణ్యాల ఫలితంతో మరో జన్మ ఆధారపడి ఉంటుందని అంటారు.  ఏది ఏమైనా గతజన్మకు సంబంధించి ఎన్నో సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం.  కొంత మంది వీటిని నమ్మేవారు ఉంటారు..కొంత మంది అబ్బే అదంతా ఓ భ్రమ అనే వారు ఉంటారు.  

ఈ మద్య సినీరాజ‌కీయ ప్ర‌ముఖుల గ‌త జ‌న్మ‌ల విశేషాలు చెబుతూ సంచ‌ల‌నంగా మారుతున్నారు ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వీ నాగనాథ్. గ‌త జ‌న్మ‌లో ఎక్క‌డ ఏ రూపంలో జ‌న్మించారు? ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర్కున్నారు? ఎలా చ‌నిపోయారు? అనే విష‌యాల‌ను తెలుపుతూ ఎస్వీనాగ్‌నాథ్ చేస్తున్న ప్రొగ్రాం చాలా పాపులర్ అవుతుంది.   సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులంద‌రి పాస్ట్ లైఫ్ ఎపిసోడ్‌ల‌తో ఈ కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని, ప్ర‌తి వారం ఒక ఎపిసోడ్ ప్ర‌సార‌మ‌వుతుంద‌ని ప్రొగ్రామ్ డైరెక్ట‌ర్ స్వామి ముద్దం తెలిపారు.
Image result for ఎన్టీఆర్ గత జన్మ
తాజాగా ప్ర‌సారం చేసిన వైఎస్ జ‌గ‌న్ పాస్ట్ లైఫ్ వీడియోకు విశేష స్పందన వస్తోందని చెప్పారు.  ఇప్పటికే పవన్ కళ్యాన్, రాజమౌళి, ఎన్టీఆర్, అల్లు అర్జున్  గత జన్మల గురించి వివరించారు.  తాజాగా  వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ పాస్ట్ లైఫ్ ఎపిసోడ్ చేశాడు. జ‌క్క‌న్న‌ గ‌త జ‌న్మ‌ఎలా ఉండేది? గ‌త జ‌న్మ ఎక్క‌డ ఎలా సాగింది? అనే విష‌యాల‌పై నాగనాథ్ చేసిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతూ హల్‌చల్ చేస్తోంది.
Image result
ఆయన చెప్పిన వివరాల ప్రకారం పూర్వ జ‌న్మ‌లో వైఎస్ జ‌గ‌న్ పాశ్చాత్య దేశంలో జ‌న్మించాడ‌ని కుంభ‌ల‌గ్నంలో జ‌న్మించాడ‌ని,  ఎన్నో ఎమోష‌న‌ల్ ఫీలింగ్స్ ఎదుర్కొన్నాడ‌ని ఆయ‌న తెలిపారు. సైన్స్ ఆండ్ టెక్నాల‌జీ విద్య అభ్యాసించాడ‌ని తెలిపారు. గ‌త‌జ‌న్మ‌లో జ‌గ‌న్ చిన్న వ‌య‌సులోనే త‌ల్లిచ‌నిపోవ‌డం, తండ్రి రెండో పెళ్లి చేసుకోవ‌డం వంటి ప‌రిణామాలు జ‌రిగాయని తెలిపారు.
Image result for అల్లు అర్జున్ గత జన్మ
త‌న‌కంటూ వినూత్న‌మైన గుర్తింపుకోసం ఆహ‌ర్నిష‌లు కృషి చేశాడని, యోగా గురువుగా మారాడ‌ని నాగ్‌నాథ్ తెలిపారు. మొండి స్వ‌భావంతో త‌ను అనుకున్న సాధించాల‌న్న క‌సితో ర‌గిపోయేవాడ‌ట‌. త‌నను తాను ప్ర‌పంచానికి ఫ్రూవ్ చేసుకోవ‌డానికి ప‌ట్టుద‌ల‌తో ఉండేవాడ‌ట‌. అతివిశ్వాసంతో జ‌గ‌న్ ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర్కున్నాడో నాగ్‌నాథ్ వివ‌రించారు.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: