sikkim bhuTan tibet border area Doka la కోసం చిత్ర ఫలితం


భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో చైనాబలగాలు మరోసారి  సిక్కిం భూటాన్ సరిహద్దు వద్ద 'హద్దు' మీరాయి. సిక్కిం సెక్టార్‌లోని భారత భూభాగంలోకి చైనా బలగాలు చొచ్చుకు రావడంతో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. చైనా-ఇండో ఫ్రాంటియర్ వద్ద పహారా కాస్తున్న భారత సైన్యం చైనా బలగాలను అడ్డుకోవడంతో పెనుగులాట ఘటనలు చోటు చేసు కున్నాయి. చైనా బలగాలు ఈ చొరబాటు సమయంలోనే రెండు బంకర్లను కూడా ధ్వసం చేసినట్టు వార్తా కథనాలు వెలువ డ్డాయి.


sikkim bhuTan tibet border area Doka la కోసం చిత్ర ఫలితం


సిక్కింలోని ‘డోకా-లా’  జనరల్ ఏరియాలో రెండు దేశాల బలగాలు గత పది రోజులుగా ముఖాముఖీ తలపడు తున్నట్టు     తెలుస్తోంది. చైనా మరింత ముందుకు వెళ్లకుండా నియంత్రించేందుకు నియంత్రణ రేఖ వద్ద భారత బలగాలు మానవహారం గా ఏర్పడి అడ్డుకుంటున్నాయి. ఈ ఘటనను కొందరు వీడియోలు, ఫోటోలు తీశారు. డోకా-లాలోని లాల్టెన్ ఏరియాలో రెండు బంకర్లను కూడా చైనా బలగాలు ధ్వంసం చేశాయి.


sikkim bhuTan tibet border area Doka la కోసం చిత్ర ఫలితం


మరోవైపు, కైలాస్ మానస సరోవర్ యాత్ర చేపట్టిన భారత తొలి బ్యాచ్‌ యాత్రికులను కూడా గతవారం చైనా బలగాలు ఆపేశాయి. తొలుత జూన్ 19న యాత్రికులు చైనా గుండా పర్యటన జరపాల్సి ఉండగా వాతావరణం అనుకూలించలేదు. దీంతో బేస్ క్యాంపులోనే ఉండిపోయిన యాత్రికులు తిరిగి ఈనెల 23న ప్రయాణమై నప్పటికీ చైనా అధికారులు అనుమతించలేదు. కైలాస మానస సరోవర యాత్రీకులను చైనీస్‌ సైనికులు అడ్డుకున్న ఘటనలో మొదట ఎలాంటి కారణాన్ని వెల్లడించలేదు. అటుపై వాతావరణ సమస్యలున్నందు వల్లే యాత్రను ఆపేసినట్లు చైనా ప్రకటించింది.

sikkim bhuTan tibet boarder కోసం చిత్ర ఫలితం


ఇండో-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను నిలువరించేందుకు ఆర్మీ సీనియర్ అధికారులు ఈనెల 20న ఫ్యాగ్ మీటింగ్ జరిపాయి. అయినప్పటికీ ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. "సిక్కిం-భూటాన్-టిబెట్"  మూడు కూడళ్ల ప్రాంతమైన "డోకా-లా ఏరియా" లోకి చైనా చొరబాటు యత్నం ఇది మొదటిది కాదు. గతంలోనూ 2008 నవంబర్‌లో ఇదే ఏరియాలో భారత ఆర్మీ ఏర్పాటు చేసిన కొన్ని తాత్కాలిక బంకర్లను చైనా బలగాలు ధ్వంసం చేశాయి.


అయితే సరిహద్దులో డ్రాగన్‌ దేశం కవ్వింపు చర్యలకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. సిక్కిం లోని భూటాన్‌ సరిహద్దు వద్ద జరిగినట్లు భావిస్తోన్న ఘటన లో చైనీస్‌ సైన్యం, భారత బలగాలను రెచ్చగొట్టడం, ప్రతిగా మనవాళ్లు డ్రాగన్లను అవతలికి నెట్టేయడం లాంటి దృశ్యాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే కైలాస మానస సరోవర యాత్రకు బయలుదేరిన భారత యాత్రీకుల బృందాన్ని భూటాన్‌ సరిహద్దుల్లో అడ్డుకున్న చైనా తీరును భారత్‌ నిరసించిన సంగతి తెలిసిందే. ఆ వివాదం సర్దు మణగకముందే డ్రాగన్స్‌ దూకుడుకు సంబంధించిన వీడియో బయటికి రావడం సంచలనంగా మారింది.


sikkim bhuTan tibet boarder  కోసం చిత్ర ఫలితం


భారత బలగాలను రెచ్చగొడుతూ, ఉద్దేశపూర్వకంగా సరిహద్దు దాటి ఇవతలికి వచ్చిన  చైనీస్‌ సైనికుల తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. సిక్కిం-భూటాన్‌-టిబెట్ సరిహద్దులోని ‘డోకా లా’ ప్రాంతంలో ఈ కొట్లాట జరినట్లు సమాచారం. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు అక్కడే భారత సైన్యం తమను రెచ్చగొడుతున్న చైనా సైన్యానికి చెక్ పెట్టటానికి వారిని నెట్టి ఈడ్చేసి నట్లు తెలుస్తుంది.  అయితే ఎప్పుడు జరిగిందనే దానిపై స్పష్టతే రాలేదు. కాగా, పదిరోజుల కిందట ఇదే డోకాలా ప్రాంతం లో భారత్‌ పునర్‌ నిర్మించిన ఓ చెక్‌పోస్టును చైనీస్‌ ఆర్మీ ధ్వసం చేసినట్లు తెలిసింది.


ఈ చర్యను భారత్‌ తీవ్రంగా నిరసించినందునే ప్రతీకారంగా చైనా, భారత యాత్రీకులను అడ్డుకుందనే విమర్శలున్నాయి. ఇక సైనికుల కొట్లాటకు సంబంధించి వైరల్‌గా మారిన వీడియోపై ఇరుదేశాల అధికారారులు స్పందిం చాల్సిఉంది. సిక్కిం సరిహద్దులోని భూటాన్‌ నిజానికి స్వతంత్ర దేశం. కానీ దాని స్వతంత్రతను గుర్తించని చైనా ఇప్పటికే కీలక భూభాగాలను స్వాధీనం చేసుకుని ఆధిపత్యం చలాయిస్తోంది.


sikkim bhuTan tibet boarder  కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: