నంద్యాల ఉప ఎన్నిక వ్యవహారం చాలా రసవత్తరంగా మారింది. అధికార పక్షాలు రెండూ గెలుపు కోసం తమ గట్టి ప్రయత్నం చేస్తున్నాయి. సర్వ శక్తులూ పెట్టి అభ్యర్ధుల ప్రకటన దగ్గర నుంచీ టీడీపీ , వైకాపా తమ తమ ఎత్తులు తాము వేస్తున్నాయి. టీడీపీ నుంచి శిల్పా  మోహన్ రెడ్డి ని పక్కన పెట్టి బ్రహ్మానంద రెడ్డి పేరు ని  ప్రకటించిన చంద్రబాబు అక్కడ విజయం తధ్యం అనే ఫీల్ లో ఉన్నారు.


అఖిల ప్రియ స్వయంగా రంగంలోకి దిగి మరీ అక్కడ తనదైన శైలి లో ప్రచారం చేస్తూ వ్యూహం రచించాల్సి ఉంది. నిజానికి నంద్యాల ఉప ఎన్నిక పూర్తిగా ఏకగ్రీవం కావాలి అనేది టీడీపీ వాదన తమ పార్టీ ఎమ్మెల్యే చనిపోయారు కాబట్టి ఆ స్థానం ఏకగ్రీవం కావడం అనాదిగా వస్తున్న ఆనవాయతీ సో నంద్యాల స్థానం తమదే అంటుంది టీడీపీ కానీ నంద్యాల లో ఎన్నో సంవత్సరాల నుంచీ పాగా వేసి ఉన్న వైకాపా మాత్రం తమ టికెట్ మీద భూమా గెలిచారు కాబట్టి తమకే ఆ స్థానం చెల్లాలి అంటుంది.


అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏపీ ప్రతిపక్ష నేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని లోట‌స్ పాండ్ లో క‌లుసుకునేందుకు భూమా అఖిల ప్లాన్ చేసుకున్నారట‌! ఎందుకంటే… తన తండ్రి మ‌ర‌ణించిన స్థానంలో పెద‌నాన్న కుమారుడు పోటీ చేస్తున్నాడ‌నీ, వైకాపాని పోటీకి దిగ‌కుండా ఏక‌గ్రీవం అయ్యేలా చెయ్యాలి అని అభ్యర్ధి బ్రహ్మానంద రెడ్డి తో పాటు అఖిల ప్రియాలు జగన్ ని కలవబోతున్నారు అని తెలుస్తోంది . ఏకగ్రీవానికి జగన్ ఎలాగూ ఒప్పుకోడు కాబట్టి ఏకగ్రీవానికి అడిగినా ఒద్దన్నారు అనేలా ప్రచారం చేసుకోవడం కోసం ఈ ప్లాన్ వేస్తోంది అఖిల ప్రియ .

మరింత సమాచారం తెలుసుకోండి: