కొత్తగా వస్తున్న జీఎస్టీ సేవల పన్ను ని తమ రాష్ట్రం లో అమలు చెయ్యం అని ప్రకటించడం తో జమ్మూ కాశ్మీర్ మీద సీరియస్ అయ్యారు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ. కాశ్మీర్ ముఖ్యమంత్రు మెహబూబా కి లేఖ రాసారు. శాసన సభ ఆమోదం లేకుండా ఆ సేవ పన్ను ఆమోదించే విశేష అధికారం రాష్ట్రానికి ఉందని, ఆర్టికల్ 370 ఆ అధికారాన్ని కట్టబెట్టిందని గుర్తు చేశారు.


కాబట్టి జీఎస్‌టీని ఆమోదించాలని కోరారు. జీఎస్‌టీని అమలు చేయకుంటే ఆ ప్రభావం రాష్ట్రంపై చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తువులు కొనుగోలు చేసే పరిస్థితి నుంచి వస్తువుల ధరలు, ఇతర ధరలు విపరీతంగా పెరిగిపోతాయి అన్నారు అరుణ్ జైట్లీ.


స్థానిక వ్యాపారులకి ఇది ఎక్కువ ఖర్చు అనీ అన్ని రకాలుగా ఆలోచించుకునే జీఎస్టీ ని తీసుకొచ్చాం అని ఆయన చెప్పుకొచ్చారు.  ఆర్టికల్ 370 కల్పించిన అధికారాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. లేదంటే ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బంది పడాల్సి వస్తుందని జైట్లీ వివరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: