indian ambassador to uk y k sinha కోసం చిత్ర ఫలితం


నేరస్థుల పాలిటి ఆధునిక స్వర‍్గధామం యునైటెడ్ కింగ్-డం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజయ మాల్యా లాంటి
నేఱస్థులు చాలా ఆనందంగా వారి స్వదేశాల పోలీస్ తదితర వ్యవస్థల నుండి తప్పించుకోవచ్చు. ఇండియా వ్యతిరేకులకు, నేరస్తులకు వేదికగా స్వర్గధామమ లా యూకే మారిందని తెలిపారు. రవి అస్థమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని సృష్టించినవాళ్ళు నేడు నేఱస్థుల పక్షం వహిస్తూ వాళ్ళ ఔన్నత్యాన్ని క్రమంగా కోల్పోతున్న దేశంగా మారుతుంది. పాకిస్థాన్ ఉగ్రవాదులకు కొమ్ము కాస్తుంటే యుకె ఆర్ధిక ఉగ్రవాదుల కొమ్ముకాయటం సిగ్గుచేటు గా పరిణమించింది.  


Britain has become a haven for fugitives, says Indian envoy to UK


అందుకే:

"లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యాకు బ్రిటన్‌ ఆశ్రయం కల్పిస్తుండటంపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. నేరస్తుల పాలిట స్వర‍్గం లా బ్రిటన్‌ తయారైందని"  ఆ దేశంలో భారత రాయబారి వైకే సిన్హా వ్యాఖ్యానించారు. మంగళవారం లండన్‌లో జరిగిన " విన్నింగ్ పార్ట్నర్-షిప్: ఇండియ-యుకె రిలేషన్స్ బియాండ్ బ్రెగ్జిట్"  అనే ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సిన్హా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఈ మేరకు ఇంగ్లాండ్ ప్రభుత్వంపై పరోక్ష ఆరోపణలు చేశారు. 


"మాది కూడా ప్రజాస్వామ్య దేశమే. అయితే, మేం మాత్రం ఇక్కడి మాదిరిగా స్నేహితులకు, సన్నిహితులకు ఇబ్బందులు కలిగే చర్యలను తలపెట్టలేం. బ్రిటన్‌ ప్రభుత్వ తీరుపై మా దేశ ప్రజలు అసంతృప్తితో ఉన్నారని"  అన్నారు. అలాగే, బ్రిటన్‌ పార్లమెంట్‌లో కూడా ఇండియా వ్యతిరేకచర్చలు జరగటాన్ని ఆయన ప్రస్తావించారు. ఇండియా - యూకే సంబంధాలపై ఇలాంటి చర్యలు ప్రభావితం కలిగిస్తాయన్నారు.


బ్రిటన్‌ మీడియా ఈ విషయంలో మరింత స్పష్టత తెచ్చుకోవాల్సి ఉందని,  ప్రస్తుత ప్రపంచ రాజకీయాల్లో ఇండియాకు ఉన్న ప్రముఖ స్థానాన్ని గుర్తించాలన్నారు. ఇండియా లోని బ్యాంకు లను ఆర్ధిక వ్యవస్థలను రూ.9వేల కోట్ల మేర మోసం చేసి పారి పోయిన భారతీయ పారిశ్రామికవేత్త ఆర్ధిక నేఱగాడు విజయ్‌ మాల్యాకు బ్రిటన్‌ ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తోందని ఆయన పరోక్షంగా ప్రస్తావించినట్లయిందని పరిశీలకులు భావిస్తున్నారు.


indian ambassador to uk y k sinha with uk prime minister కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: