indo china border and both armies కోసం చిత్ర ఫలితం


భారత సైనిక దళాలు చైనా భూభాగంలోకి చొచ్చుకు వచ్చాయని భారత్ ను నిందిస్తూ చైనా మంగళవారం తమ నిరసన వ్యక్తం చేసింది. అలా చైనాలోకి వచ్చిన సైనికులు వెంటనే వెనక్కు వెళ్లాలని కఠినంగా చెప్పింది. తాజాగా ఏర్పడ్డ ఘర్షణాత్మక వాతా వరణాన్ని సామరస్యంగా పరిష్కరించే మార్గం లో నిర్ణ్యాలు తీసుకోక పోతే  భవిష్యత్తులో భారతీయులను మానస సరోవర్‌ యాత్రలకు అనుమతించాలా? లేదా? అనేదానిపై తాము పునరాలోచించే విషయం ఆధారపడి ఉంటుందని చైనా నిష్కర్షగా పేర్కొంది. 


ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితులు, భద్రతా కారణాల వల్లనే మానస సరోవర్‌ యాత్రకు వచ్చిన భారతీయులను అనుమతించ లేదని చైనా తెలిపింది.


manasa sarovar yatra photos కోసం చిత్ర ఫలితం


"మా ప్రాంత సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి మేం కట్టుబడి ఉన్నాం. ఈ అంశంలో భారత్‌ కూడా చైనాతో కలిసి నడుస్తుందనీ, చైనా భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయ సైనికులను వెంటనే వెనక్కు పిలుస్తుందని ఆశిస్తున్నాం" అని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి లూ కాంగ్‌ చెప్పారు. న్యూఢిల్లీలోనూ, బీజింగ్‌ లోనూ దౌత్యపరంగా తమ నిరసన, ఈ విషయం లో వైఖరిని భారత్‌కు తెలియజేశామని ఆయన వెల్లడించారు. 


"భారత యాత్రికులకు సౌకర్యాలు, భద్రత కల్పించడానికి చైనా ఇప్పటివరకు కావలసినంత చేసిందని, తాజాగా భారత దళాలు చైనా భూభాగంలోకి ప్రవేశించిన పరిస్థితు ల్లో, తాము రోడ్ల నిర్మాణాన్ని నిలిపివేయవలసి వచ్చిందని - అయితే భద్రతా కారణాల వల్లనే ప్రస్తుతం భారతీయ యాత్రికులను చైనా మీదుగా వెళ్లనీయడం లేదు" అని లూ కాంగ్‌ అన్నారు.


manasa sarovar yatra photos కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: